Home /News /sports /

TELANGANA CHIEF MINISTER KCR REACTED TO NIKHAT ZAREEN FROM NIZAMABAD BECOMING THE WORLD CHAMPION IN THE WORLD WOMEN BOXING CHAMPIONSHIPS PRV

Nikhat Zareen | CM KCR: బాక్సింగ్​లో చరిత్ర సృష్టించిన నిజామాబాద్​ బిడ్డ నిఖత్​ జరీన్​.. తెలంగాణ సీఎం కేసీఆర్​ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్​, నిఖత్ (ఫైల్​)

సీఎం కేసీఆర్​, నిఖత్ (ఫైల్​)

ప్రతిష్టాత్మక ' ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్' పోటీల్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు

    తెలంగాణ (Telangana )కు చెందిన యువకిరణం నిఖత్ జరీన్ (Nikhat zareen) చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్  (World Women Boxing Championships Finals) పోటీల్లో 52 కిలోల విభాగంలో.. థాయ్ లాండ్ దేశానికి చెందిన జిట్ పాంగ్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి నుంచి నిఖత్ జరీన్ దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్ లతో విరుచుకు పడింది. కాగా, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పసిడి సాధించిన ఐదే బాక్సర్ గా రికార్డు సాధించింది. గతంలో మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ ఎల్, లేఖ కేసీ మాత్రమే పసిడి పతకాన్నిసాధించారు. నిఖత్ జరీన్ (Nikhat zareen) సాధించిన అద్భుత విజయానికి ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 12 మంది సభ్యులతో కూడిన భారతీయ బృందాన్ని ఇస్తాంబుల్ (Istanbul) కి పంపారు. కాగా, నిఖత్​ జరీన్​ విజయం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్​ స్పందించారు.

    ప్రతిష్టాత్మక ' ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ (World Women Boxing Championships)' పోటీల్లో నిజామాబాద్ (Nizamabad) కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేత (world champion)గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు (Cm KCR Wishes) తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడావేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం కేసిఆర్ (Telangana CM KCR)  మనస్ఫూర్తిగా అభినందించారు.

    ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు..

    ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన (Proud Moment) విషయమని సీఎం అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని,. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

    Telangana girl reaches Mount Everest: తెలుగు బిడ్డ అరుదైన ఘనత.. మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన అంగన్‌వాడీ కూతురు!

    2014 లో తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) ఏర్పడిన తర్వాత నిఖత్ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర సర్కారు.. రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు  (Telangana CM KCR) చేతుల మీదుగా ఆమె ఆర్థిక సాయం (Financial Help) అందుకుంది. అయితే ఆ తర్వాత ఆమె పలు అంతర్జాతీయ టోర్నీలలో (International Tournaments) గెలిచినా ప్రభుత్వం నుంచి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Boxing, CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు