కేటీఆర్‌కు వీవీఎస్ లక్ష్మణ్ అభినందనల ట్వీట్

మీరు తెలంగాణ ప్రజలకు సేవలను కొనసాగించి, మన రాష్ట్రం గొప్ప స్థాయిలో ఉండేలా చూస్తారని కేటీఆర్‌కు వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: December 12, 2018, 7:01 AM IST
కేటీఆర్‌కు వీవీఎస్ లక్ష్మణ్ అభినందనల ట్వీట్
వీవీఎస్ లక్ష్మణ్ జీవిత చరిత్ర పుస్తకం ‘281 అండ్ బియాండ్’ ఆవిష్కరణలో లక్ష్మణ్, కేటీఆర్, పుల్లెల గోపీచంద్
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కేటీఆర్‌కు భారత జట్టు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలిపారు.  తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఏకంగా ‌88 స్థానాలను కైవసం చేసుకుని గులాబీ సునామీ సృష్టించింది. కాంగ్రెస్ 19, టీడీపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం 7, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించడంపై  వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్‌లో స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీరు తెలంగాణ ప్రజలకు సేవలను కొనసాగించి, మన రాష్ట్రం గొప్ప స్థాయిలో ఉండేలా చూస్తారని కేటీఆర్‌కు వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. అభినందనలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Congratulations @KTRTRS for the thumping win. May you continue to serve our people and lead our State to greater heights. Good Luck & God Speed 👍అటు స్టార్ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల, కశ్యప్, సానియా మిర్జా, గగన్ నారంగ్,  డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, దయానిధి మారన్, ఒమర్ అబ్దుల్లా,  సినీ నటులు మహేశ్ బాబు, రవితేజ, రామ్, అక్కినేని అఖిల్,  నాని, రాంగోపాల్ వర్మ, మంచు లక్ష్మి, మంచు విష్ణు, తదితరులు ట్విట్టర్‌లో కేటీఆర్‌కు అభినందనలు తెలపగా...వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Published by: Janardhan V
First published: December 12, 2018, 6:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading