ఇంగ్లండ్‌‌‌‌‌లో మరో సిరీస్ మిస్ చేసుకున్న ఇండియా

ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా మరో టెస్ట్ సిరీస్ ఓటమి మూటగట్టుకుంది. ఇండియాపై ఇంగ్లండ్‌ 19వ సారి టెస్ట్ సిరీస్ విజయం సాధించింది.

news18-telugu
Updated: September 12, 2018, 5:24 PM IST
ఇంగ్లండ్‌‌‌‌‌లో మరో సిరీస్ మిస్ చేసుకున్న ఇండియా
ఓవల్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ (Reuters)
news18-telugu
Updated: September 12, 2018, 5:24 PM IST
స్వదేశీ టెస్ట్ సిరీస్‌ల్లో చిరస్మరణీయ విజయాలు సాధించి,ఎన్నో సిరీస్‌‌లు నెగ్గిన భారత్‌‌కు విదేశాల్లో టెస్ట్‌ సిరీస్‌‌లు నెగ్గడం పెద్ద సవాలే. ఇంగ్లండ్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోనూ టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. భారీ అంచనాల మధ్య ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన భారత్‌ ఎప్పటిలానే నిరాశపర్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విరాట్ సేన విజయం సాధించగలిగింది. నాలుగు టెస్ట్‌ల్లోనూ భారత్‌పై ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో నెగ్గింది. లండన్‌లోని లార్డ్స్ స్టేడయం వేదికగా జరిగిన టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో ఇండియా 203 పరుగుల భారీ తేడా విజయం సాధించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాల్గవ టెస్ట్‌లో 60 పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఓవల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ 118 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా డ్రాగా ముగియకపోవడం విశేషం.
ఇప్పటివరకూ మరే ఇతర జట్టుతో ఆడనన్ని టెస్ట్‌లు ఇంగ్లండ్‌తోనే ఆడింది. ఒక్క ఇంగ్లీష్ టీమ్‌తోనే భారత్ 122 టెస్ట్‌ల్లో పోటీపడింది. టెస్ట్‌ల్లో మిగతా జట్లతో పోల్చుకుంటే ఇంగ్లండ్‌పై మాత్రం భారత జట్టు విజయశాతం తక్కువే. 1932లో తొలి టెస్ట్ సిరీస్‌ ఆడిన ఇండియా-ఇంగ్లండ్...ఇప్పటి 5 మ్యాచ్‌ల సిరీస్‌ వరకూ 33 టెస్ట్ సిరీస్‌ల్లో పోటీపడ్డాయి.
మొత్తంగా 33 టెస్ట్ సిరీస్‌ల్లో ఇంగ్లండ్ 19 సిరీస్ విజయాలు సాధించగా...ఇండియా 10 సిరీస్ విజయాలు నమోదు చేసింది. ఇంగ్లండ్‌ గడ్డపై ఇరు జట్లు 18 సార్లు టెస్ట్‌ సిరీస్‌ల్లో పోటీపడ్డాయి. 14 సార్లు ఇంగ్లండ్ సిరీస్ విజయాలు సాధించింది. 3 సార్లు మాత్రమే భారత్ ఆతిధ్య జట్టును ఓడించగలిగింది. ఒక్క సిరీస్ డ్రాగా ముగిసింది. భారత్‌లో ఇరు జట్లు 15 టెస్ట్ సిరీస్‌ల్లో తలపడ్డాయి. 7 సిరీస్‌ల్లో భారత్ విజయం సాధించగా...5 సార్లు ఇంగ్లండ్ సిరీస్‌ విజేతగా నిలిచింది. 3 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఓవరాల్ టెస్ట్ ఫేస్ టు ఫేస్ రికార్డ్‌లోనూ ఇండియాపై ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉంది.

ఇప్పటివరకూ ఇండియా-ఇంగ్లండ్ 122 టెస్ట్‌ల్లో పోటీపడ్డాయి. ఇంగ్లండ్ 47 టెస్ట్‌ల్లో విజయం సాధించింది.ఇండియా 26 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది.49 టెస్ట్‌లు డ్రాగా ముగిశాయి. ఇంగ్లండ్‌లో ఇరు జట్లు 62 మ్యాచ్‌ల్లో పోటీపడ్దాయి. ఇంగ్లండ్ 34 టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఇండియా 7 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 21 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇండియాలో ఇరు జట్లు 60 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్ 13 టెస్టుల్లో నెగ్గింది.28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇంగ్లండ్‌తో లేటెస్ట్‌గా ముగిసిన 5 మ్యాచ్‌ల సిరీస్‌తో చరిత్రను తిరగరాయాలని భావించిన భారత జట్టుకు భంగపాటు తప్పలేదు.

ఇవీ చదవండి:


ఇంగ్లండ్‌‌‌‌‌లో మరో సిరీస్ మిస్ చేసుకున్న ఇండియా
ఇంగ్లండ్ టూర్‌లో విరాట్ సేన నాలుగు మ్యాచ్‌లే నెగ్గింది!!

First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...