టీమ్ ఇండియా (Team India) ఇక స్వదేశంలో వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా మారిపోనున్నది. కోవిడ్ (Covid-19) కారణంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కేవలం ఇంగ్లాండ్‌తో (England) మాత్రమే సిరీస్ జరిగింది. ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో వరుసగా నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లకు బీసీసీఐ (BCCI) పచ్చజెండా ఊపింది. సోమవారం దుబాయ్ వేదికగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), కార్యదర్శి జై షా (Jay Shah) సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు. చాన్నాళ్ల తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం వర్చువల్ విధానంలో కాకుండా నేరుగా జరిగింది. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన బోర్డు పెద్దలు అనేక కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు. దేశవాళీ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు టీమ్ ఇండియా ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌కు పచ్చజెండా ఊపారు.
ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత నవంబర్ 17 నుంచి వచ్చే ఏడాది జూన్ 19 వరకు న్యూజీలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లు ఆడనున్నది. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత నవంబర్ 17 నుంచి వచ్చే ఏడాది జూన్ 19 వరకు న్యూజీలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లు ఆడనున్నది. 8 నెలల కాలంలో నాలుగు దేశాలతో కలిపి మొత్తం 4 టెస్టులు, 14 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనున్నది. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవి నుంచి వైదొలగనున్నాడు. అలాగే టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కొత్త హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉన్నది. అంతే కాకుండా టీ20 ఫార్మాట్ కెప్టెన్‌పై నిర్ణయం తీసుకోవాలి. న్యూజీలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభానికి ముందే ఈ రెండు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
BCCI: బీసీసీఐకి షాక్ ఇచ్చిన తాలిబన్లు.. భారీగా ఆదాయాన్ని నష్టపోనున్న క్రికెట్ బోర్డు
? UPDATE ?: Key decisions taken at 9th Apex Council Meeting of BCCI
Details ?
— BCCI (@BCCI) September 20, 2021
పూర్తి షెడ్యూల్:
ఇండియా Vs న్యూజీలాండ్
నవంబర్ 17 - తొలి టీ20 - జైపూర్
నవంబర్ 19 - రెండో టీ20 - రాంచి
నవంబర్ 21 - మూడో టీ20 - కోల్‌కతా
నవంబర్ 25 నుంచి 29 - తొలి టెస్టు - కాన్పూర్
డిసెంబర్ 3 నుంచి 7 - రెండో టెస్టు - ముంబై
ఇండియా Vs వెస్టిండీస్
ఫిబ్రవరి 6 - తొలి వన్డే - అహ్మదాబాద్
ఫిబ్రవరి 9 - రెండో వన్డే - జైపూర్
ఫిబ్రవరి 12 - మూడో వన్డే - కోల్‌కతా
ఫిబ్రవరి 15 - తొలి టీ20 - కటక్
ఫిబ్రవరి 18 - రెండో టీ20 - వైజాగ్
ఫిబ్రవరి 20 - మూడో టీ20 - త్రివేండ్రం
ఈ ఆటగాడు ఎవరో గుర్తుపట్టగలరా? ఈ మధ్య అందరికీ సుపరిచితమైన ఫేమస్ అథ్లెట్ ఇతడు..
ఇండియా Vs శ్రీలంక
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 - తొలి టెస్టు - బెంగళూరు
మార్చి 05 నుంచి మార్చి 9 - రెండో టెస్టు - మొహలి
మార్చి 13 - తొలి టీ20 - మొహలి
మార్చి 15 - రెండో టీ20 - ధర్మశాల
మార్చి 18 - మూడో టీ20 - లక్నో
ఇండియా Vs సౌతాఫ్రికా
జూన్ 9 - తొలి టీ20 - చెన్నై
జూన్ 12 - రెండో టీ20 - బెంగళూరు
జూన్ 14 - మూడో టీ20 - నాగ్‌పూర్
జూన్ 17 - నాలుగో టీ20 - రాజ్‌కోట్
జూన్ 19 - ఐదో టీ20 - ఢిల్లీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Team India