హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India Squads : టీ20 జట్టులో SRH స్పీడ్ స్టార్.. టెస్ట్ టీంలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు..

Team India Squads : టీ20 జట్టులో SRH స్పీడ్ స్టార్.. టెస్ట్ టీంలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు..

Team India

Team India

Team India Squads : ఐపీఎల్ తర్వాత దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ను ఆడుతుంది టీమిండియా. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన పది రోజుల తర్వాత దక్షిణాఫ్రికా(South Africa)తో భారత్ (India) పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌లో గతేడాది మిగిలిపోయిన చివరి టెస్ట్‌తో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు సంబంధించిన జట్లను బీసీసీఐ కాసేపటి క్రితమే ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోయే జట్టులో ఊహించినట్టే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కింది.

అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌ను సైతం ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్‌లను జట్టులోకి తీసుకుంది. మొత్తం 18 మందితో కూడిన ఈ జట్టును పేర్లను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. టీ20 జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహించనున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్‌ వైస్ కెప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు.

దీనితోపాటు పనిలో పనిగా ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తాడు ఈ జట్టుకు. వైస్ కేప్టెన్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. కేఎస్ భరత్‌ను జట్టులోకి తీసుకుంది. ఏపీ తెలంగాణ నుంచి ముగ్గురు క్రికెటర్లు టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు. కేఎస్ భరత్, హనుమ విహారి, మహ్మద్ సిరాజ్.. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లే.

ఐపీఎల్ తర్వాత దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ను ఆడుతుంది టీమిండియా. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.

17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తన జట్టును ఇదివరకే ప్రకటించింది కూడా. భారత పర్యటనకు వచ్చే 16 మంది సభ్యులు ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు టెంబా బావుమా సారథ్యాన్ని వహించనున్నాడు. ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటివారంలో జట్టు భారత్‌కు చేరుకుంటుంది.

టీ20 జట్టు :

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వైస్ కేప్టెన్-వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌

ఇంగ్లండ్ తో మ్యాచ్ కు టెస్ట్ జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చేతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజ, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

First published:

Tags: Bcci, India vs england, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India

ఉత్తమ కథలు