హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India : కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. హెడ్ కోచ్ లక్ష్మణ్.. ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా సైన్యం ఇదే..!

Team India : కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. హెడ్ కోచ్ లక్ష్మణ్.. ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా సైన్యం ఇదే..!

హార్దిక్ పాండ్యా (ఫైల్ ఫోటో)

హార్దిక్ పాండ్యా (ఫైల్ ఫోటో)

Team India : ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించి ఏకంగా ఆ జ‌ట్టును విజేత‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాకు తగిన ప్రతిఫలం దక్కింది.

ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో తన నాయకత్వ పటిమ చూపి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కు టైటిల్స్ అందించిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు తగిన ప్రతిఫలం దక్కింది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు (Team India)ను బీసీసీఐ (BCCI) బుధ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా(India vs South Africa)తో జ‌రుగుతున్న సిరీస్ ముగియ‌గానే... టీమిండియా ఐర్లాండ్ టూర్‌కు వెళ్ల‌నుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించి ఏకంగా ఆ జ‌ట్టును విజేత‌గా నిలిపిన పాండ్యాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోగా...తాజాగా ఏకంగా ఐర్లాండ్‌తో సిరీస్‌లో అత‌డికి ఏకంగా కెప్టెన్సీ ద‌క్క‌డం విశేషం.

ఇక వైస్ కెప్టెన్‌గా భువ‌నేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. అలాగే ఐపీఎల్ స్టార్ ప్లేయర్స్ సంజూశాంసన్ (Sanju Samson), సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా సభ్యులు దక్షిణాఫ్రికా సిరీస్‌‌కు ఎంపికయిన ప్లేయర్లే కావడం గమనార్హం. ఇక హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా జూన్ 26, 28తేదీల్లో 2 టీ20లు ఐర్లాండ్‌తో ఆడనుంది.

ఇక దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 19న పూర్తి అవుతుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా సిరీస్ అనంతరం ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్, టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని సీనియర్ టీం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

ఇది కూడా చదవండి :  బాబు పంత్ ఇలా అయితే కష్టమే సుమీ.. ఈ లెక్కలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది..!

అందువల్ల పంత్ కెప్టెన్సీకి టాటా చెప్పాల్సి వచ్చింది. దీంతో హార్దిక్ పాండ్యాకు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. 17మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.

ఐర్లాండ్‌లో జరిగే 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి, సితాన్షు కోటక్,  టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం వీరు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లుగా వ్యవహరిస్తుండగా, ఎన్సీఏ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

టీమిండియా జట్టు :

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిష‌న్‌, రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్‌, దీప‌క్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), య‌జువేంద్ర చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, అవేశ్ ఖాన్‌, అర్ష‌దీప్ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌

First published:

Tags: Cricket, Hardik Pandya, India vs South Africa, Rishabh Pant, Sanju Samson, Sports

ఉత్తమ కథలు