హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : హలమతి హబీబో అంటున్న టీమిండియా యంగ్ గన్స్.. అరబిక్ కుతు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు..

Viral Video : హలమతి హబీబో అంటున్న టీమిండియా యంగ్ గన్స్.. అరబిక్ కుతు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు..

(Photo Credit : Instagram)

(Photo Credit : Instagram)

Viral Video : చిత్ర సీమకు సంబంధించిన బిగ్ స్టార్స్ అంతా ఇప్పటికే ఈ పాటకు తమ కాలు కదిపారు. అనేక మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో టీమిండియా యంగ్ గన్స్ చేరారు.

  త‌మిళంలో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) న‌టిస్తున్న బీస్ట్ చిత్రంలోని Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. ఈ చార్ట్‌బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.6 మిలియన్లకు పైగా లైక్‌లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ పాట ఇదే కావడం విశేషం. “అరబిక్ కుతు” అత్యంత ఇష్టపడే లిరికల్ వీడియోగా రికార్డును బ్రేక్ చేయడానికి కేవలం 28 రోజులు మాత్రమే పట్టింది. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు నటుడు శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. జోనితా గాంధీ, అనిరుధ్ ఈ సెన్సేషనల్ ట్రాక్‌ను పాడారు. సన్ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇక విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర సీమకు సంబంధించిన బిగ్ స్టార్స్ అంతా ఇప్పటికే ఈ పాటకు తమ కాలు కదిపారు. అనేక మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో టీమిండియా యువ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్య‌ర్ (Venkatesh Iyer), ఆవేష్ ఖాన్ (Avesh Khan) కూడా చేరారు.

  వీరిద్ద‌రు క‌లిసి అర‌బిక్ కుతు సాంగ్‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. వీడియోలో ఈ ఇద్ద‌రు హీరో విజ‌య్‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఇదిలాఉండగా.. ఈ వీడియోను ఇన్స్టాలో షేర్ చేస్తూ అవేశ్ ఖాన్.. ‘ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న అరబిక్ కుత్తు ను ట్రై చేస్తున్నాను..’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోను తీసింది ఇషాన్ కిషాన్ కావడం విశేషం.

  View this post on Instagram

  A post shared by Avesh Khan (@aavi.khan)

  ఇక, రానున్న ఐపీఎల్‌ 2022లో వెంక‌టేష్ అయ్య‌ర్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌నుండ‌గా.. ఆవేష్ ఖాన్ కొత్త జ‌ట్టు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు. మెగా వేలానికి ముందే కోల్‌కతానైట్ రైడ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్‌ వెంక‌టేష్ అయ్య‌ర్‌ను రిటైన్ చేసుకుంది.

  ఇది కూడా చదవండి :  ఐపీఎల్ లో మేటి నాయకులు వీళ్లే... విజయాల శాతం ప్రకారం టాప్ ఎవరంటే..

  ఇక పేస్ బౌల‌ర్ ఆవేష్ ఖాన్‌ను మెగా వేలంలో 10 కోట్ల రూపాయ‌ల భారీ ధ‌ర వెచ్చింకి కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌గా ఆవేష్ ఖాన్ నిలిచాడు. కేవ‌లం 20 ల‌క్ష‌ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన ఆవేష్ ఖాన్‌ను అంత‌కు 25 రెట్లు అధికంగా చెల్లించి ల‌క్నో కొనుగోలు చేయ‌డం చేసింది. ఈ క్యాష్ రీచ్ లీగ్ ఇద్దరికి కీలకం కానుంది. ఈ మెగాటోర్నీలో సత్తా చాటితే.. టీమిండియాలో వీళ్ల స్థానాలకు ఎటువంటి ఢోకా ఉండదు.

  First published:

  Tags: Cricket, Hero vijay, IPL 2022, Kolkata Knight Riders

  ఉత్తమ కథలు