ENG Vs IND : 40 ఏళ్లలో 9 ఇంగ్లాండ్ పర్యటనలు.. గెలిచింది రెండు సార్లే.. చివరి సారిగా ఎప్పుడంటే?

ఇంగ్లాండ్ గడ్డపై ఉన్న చెత్త రికార్డును భారత జట్టు తుడిచేస్తుందా?

40 ఏళ్లలో 9 సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే సిరీస్ గెలుచుకున్నది. గత 14 ఏళ్లుగా భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడపోవడం గమనార్హం. మరి ఈ సారైనా కోహ్లీ సేన ఈ చెత్త రికార్డును చెరిపేస్తుందా?

  • Share this:
    భారత క్రికెట్ జట్టు (Team India) మూడేళ్ల తర్వాత మరోసారి ఇంగ్లాండ్ పర్యటనకు (England Tour) వెళ్లనున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన 5 వారాల తర్వాత అగస్టు 4 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్నది. భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ (Test Series) గెలిచి 14 ఏళ్లు గడిచి పోయింది. గత 40 ఏళ్ల చరిత్ర తీసుకుంటే భారత జట్టు 9 సార్లు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా కేవలం రెండు సార్లు మాత్రమే ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌లు కైవసం చేసుకున్నది. ఇంగ్లాండ్ గడ్డపై అత్యంత చెత్త రికార్డు కలిగిన టీమ్ ఇండియా ఈ సారి ఏం చేస్తుందా అని అందరూ ఆసక్తికంగా ఎదురు చూస్తున్నారు. భారత జట్టు తొలి సారిగా 1932లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అయితే తొలి టెస్టు సిరీర్ వారి గడ్డపై గెలవ డానికి 1971 వరకు వేచి చూడాల్సి వచ్చింది. అజిత్ వాడేకర్ సారథ్యంలో వెళ్లిన టీమ్ ఇండియా 3 టెస్టుల సిరీస్ ఆడింది. తొలి రెండు టెస్టులు డ్రా చేసుకున్న ఇండియా.. మూడో టెస్టులో మాత్రం 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై గెలవడం అదే తొలిసారి.

    ఆ తర్వాత మళ్లీ 15 ఏళ్లకు కపిల్ దేవ్ సారథ్యంలోని ఇండియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గింది. భారత జట్టు చివరి సారిగా 2007లో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ఇంగ్లాండ్ వెళ్లిన టీమ్ ఇండియా మొత్తం మూడు టెస్టులు ఆడింది. రెండో టెస్టులో టీమ్ ఇండియా విజయం సాధించగా, మిగిలిన రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. దీంతో తొలి పటౌడీ ట్రోఫీ టీమ్ ఇండియాకు దక్కింది. 1981 నుంచి ఇప్పటి వరకు అంటే 40 ఏళ్లలో భారత జట్టు 9 సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించగా కేవలం రెండు సార్లు మాత్రమే టీమ్ ఇండియా సిరీస్‌లు నెగ్గింది.

    Virat Kohli : డబ్ల్యూటీసీలో ఆ రికార్డులపై విరాట్ కోహ్లీ కన్ను.. ఊరిస్తున్న మూడు మైలురాళ్లు

    ధోనీ సారథ్యంలోని టీమ్ ఇండియా 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. రెండు టెస్టులు ముగిసే సరికి 1-0 ఆధిక్యంలో ఉన్నది. కానీ చివరి మూడు టెస్టులు ఓడిపోయి నిరాశగా వెనుదిరిగింది. మూడేళ్ల క్రితం కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఐదు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-1తో గెలుచుకుంది. అయితే ఆ తర్వాత కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు విదేశాల్లో మంచి ప్రదర్శనే చేసింది. వరుసగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా (రెండు సార్లు) పర్యటనల్లో సిరీస్‌లు నెగ్గింది. ఒక్క న్యూజీలాండ్ పర్యటన మినహా.. భారత జట్టు గత మూడేళ్లలో విదేశీ పర్యటనల్లో ఓడిపోలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై ఉన్న చెత్త రికార్డును తుడిచి పెట్టాలని టీమ్ ఇండియా భావిస్తున్నది.

    'ఈ సారి టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో మంచి ప్రదర్శన చేస్తుంది. ఆ సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచే అవకాశం ఉన్నది. టీమ్ ఇండియా బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంలో ఉన్నది. ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ పటిష్టంగా ఉన్నది. అయితే బ్యాటింగ్ విషయంలోనే నిలకడైన బ్యాట్స్‌మాన్ లేడు. కెప్టెన్ జో రూట్ మినహా ఆ జట్టులో ఈ మధ్య నిలకడగా బ్యాటింగ్ చేసే వాళ్లు కరువయ్యారు. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా ఎవరూ రాణించడం లేదు. ఇది టీమ్ ఇండియాకు కలిసి వస్తుంది' అని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.
    Published by:John Naveen Kora
    First published: