భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ పర్యటన.. ఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్.. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే?

ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత మహిళా జట్టు ఇదే!

భారత మహిళా క్రికెట్ జట్టు ఏడేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.. మహిళా జట్టు కూడా అదే దేశంలో పర్యటించనున్నది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే మహిళా జట్టును ప్రకటించారు.

  • Share this:
    ఇండియా (Team India) మహిళా క్రికెట్ జట్టు (Women) ఇంగ్లాండ్ పర్యటనకు (England tour) వెళ్లనున్నది. ఈ పర్యటనలో ఏకైక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నది. ఈ పర్యటనకు వెళ్లే భారత మహిళా జట్టును శుక్రవారం బీసీసీఐ (BCCI) మహిళా సెలెక్షన్ కమిటీ (Selection Committee) ప్రకటించింది. వికట్‌కీపర్, బ్యాటర్ ఇంద్రానీ రాయ్ తొలి సారిగా టెస్ట్, వన్డే జట్టులోకి వచ్చింది. కాగా, ఎడమచేతి వాటం స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ గాయం కారణంగా ఈ పర్యటనకు ఎంపిక కాలేదు. టెస్ట్, వన్డేలకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నది. అదే సమయంలో టీ20లకు హర్మాన్ ప్రీత్ కౌర్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు సెలెక్షన్ కమిటీ చెప్పింది. టీమ్ ఇండియా పురుషుల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే సమయంలోనే భారత మహిళా జట్టు కూడా ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడనున్నది. పురుషుల జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటానికి ముందే ఇంగ్లాండ్ జట్టుతో మహిళా జట్టు ఏకైక టెస్ట్ ఆడనున్నది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత మహిళా జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటం విశేషం. భారత జట్టు చివరి సారిగా 2014లో మైసూర్ వేదికగా సౌతాఫిక్రాతో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు గత 16 ఏళ్లలో కేవలం మూడే టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2006, 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో ఒక్కో టెస్ట్ ఆడింది. రెండింటిలోనూ భారత మహిళా జట్టు విజయం సాధించింది.

    టీమ్ ఇండియా బ్యాటింగ్ సంచలన షెఫాలీ వర్మ, పేసర్ శిఖా పాండే మూడు ఫార్మాట్లకు ఎంపికయ్యారు. హెడ్ కోచ్ రమేష్ పవార్ మూడు ఫార్మాట్లలో జట్టుకు శిక్షణ ఇవ్వనుండగా.. వెటరన్ క్రికెటర్లు మిథాలీ, ఝులన్ కేవలం టెస్ట్, వన్డేలకు పరిమితం అయ్యారు. వీరిద్దరూ గతంలోనే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పారు.





    భారత మహిళా టీ20 జట్టు : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెర్మిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తనియా భాటియా (కీపర్), ఇంద్రాణీ రాయ్ (కీపర్), శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, రాధా యాదవ్, సిమ్రన్ దిల్ బహదూర్

    భారత మహిళా టెస్ట్, వన్డే జట్టు : మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియ పూనియ, దీప్తి శర్మ, జెర్మిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తనియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రణీ రాయ్ (వికెట్ కీపర్), ఝులన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, రాధా యాదవ్

    ఇంగ్లాండ్ పర్యటన పూర్తి షెడ్యూల్



















































    ఫార్మాట్ తేదీ వేదిక సమయం
    ఏకైక టెస్ట్ జూన్ 16 - 17 బ్రిస్టల్ మధ్యాహ్నం 3.30 గంటలు
    తొలి వన్డే జూన్ 27 బ్రిస్టల్ మధ్యాహ్నం 3.00 గంటలు
    2వ వన్డే జూన్ 30 టాంటన్ సాయంత్రం 6.30 గంటలు (డే/నైట్)
    3వ వన్డే జులై 3 వోర్సెస్టర్ మధ్యాహ్నం 3.00 గంటలు
    తొలి టీ20 జులై 9 నార్తన్ట్స్ రాత్రి 11.00 గంటలు (నైట్ మ్యాచ్)
    2వ టీ20 జులై 11 హోవ్ రాత్రి 7.00 గంటలు
    3వ టీ20 జులై 15 ఛెమ్స్‌ఫోర్డ్ రాత్రి 11.00 గంటలు (నైట్ మ్యాచ్)
    Published by:John Naveen Kora
    First published: