ఆ బాలీవుడ్‌ హీరోపై క్రష్ పెంచుకున్న క్రికెటర్ స్మృతీ మందనా

స్మృతీ మందనా (File Photo)

Smriti Mandhana : స్మృతీ మందనా ఇలా చాట్ మొదలుపెట్టిందో లేదో.. ఫ్యాన్స్ నుంచి కుప్పలు తెప్పలుగా ప్రశ్నల వర్షం మొదలైపోయింది. వాటిలో కొన్నింటికి స్మృతీ మందనా సరదా సమాధానాలిచ్చింది.

 • Share this:
  అందం,టాలెంట్‌తో టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతీ మందనా కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే మందనా.. తాజాగా వారితో చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పింది. నిజానికి తన సహచర క్రికెటర్ జెమిమా రొడ్రిగ్స్ బలవంతం మేరకే తాను చాట్ చేస్తున్నానని ముందే చెప్పేసింది. స్మృతీ మందనా ఇలా చాట్ మొదలుపెట్టిందో లేదో.. ఫ్యాన్స్ నుంచి కుప్పలు తెప్పలుగా ప్రశ్నల వర్షం మొదలైపోయింది. వాటిలో కొన్నింటికి స్మృతీ మందనా సరదా సమాధానాలిచ్చింది.

  మీకు ఎవరిపై అయిన క్రష్ ఉందా? అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు.. మందన్నా 'హృతిక్ రోషన్' అని బదులిచ్చింది. తనకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి హృతిక్‌పై క్రష్ ఉందని చెప్పింది. ఇక మీరు సింగిలా? లేక రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు.. 'హమ్‌మ్.. బహుశా సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది.


  ఇదిలా ఉంటే, మహిళా క్రికెట్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 2వేల పరుగులు సాధించిన మూడో మహిళగా స్మృతీ ఇరానీ రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన మూడో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిందా క్లార్క్ మొదటి స్థానంలో ఉంది. కేవలం 45 మ్యాచ్‌లలోనే ఆమె 2వేల పరుగులు సాధించింది.
  Published by:Srinivas Mittapalli
  First published: