• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • TEAM INDIA WILL BE FULL BUSY IN 2022 KOHLI ARMY TO PLAY HOME AND FOREIGN SERIES JNK

Team India : 2022లో టీమ్ ఇండియా బిజీ బిజీ.. ఏడాదంతా వరుసగా క్రికెట్ సిరీస్‌లు ఆడనున్న కోహ్లీ సేన

ఏడాదంతా బిజీ బిజీగా గడపనున్న కోహ్లీ సేన (PC: BCCI)

టీమ్ ఇండియా ఇకపై పూర్తి బిజీగా మారనున్నది. ఈ ఏడాదే కాకుండా 2022లో పలు విదేశీ పర్యటనలు, హోమ్ సిరీస్‌లతో కోహ్లీ సేన బిజీగా గడపనున్నది.

  • Share this:
    కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా ఏడాదిన్నరగా టీమ్ ఇండియా (Team India) ఆడాల్సిన పలు సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ)లోని (ICC FTP) సిరీస్‌లు రద్దు కావడంతో షెడ్యూల్ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో రద్దయిన సిరీస్‌లతో పాటు ఎఫ్‌టీపీలోని పలు మ్యాచ్‌లతో టీమ్ ఇండియా బిజీ బిజీగా మారిపోనుంది. 2022 ఏడాదంతా కోహ్లీ సేన క్రికెట్ మ్యాచ్‌లతో సందడి టీచేయనుంది. 2022 జనవరిలో వెస్టిండీస్ జట్టు ఇండియాలో పర్యటించనున్నది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఇండియాకు రానున్నది. భారత జట్టు శ్రీలంకతో 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనున్నది. ఈ రెండు సిరీస్‌ల తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఆ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు అటు నుంచి అటే వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుంది. జులై-అగస్టు మధ్యలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. కాగా, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా బీసీసీఐ ఖరారు చేయలేదు. శ్రీలంక సిరీస్, ఇంగ్లాండ్ పర్యటన మధ్యలో ఐపీఎల్ 2022లో భారత జట్టు ఆటగాళ్లు ఆడనున్నారు.

    భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సెప్టెంబర్‌లో ఆసియా కప్‌లో పాల్గొననున్నది. ఆసియా కప్ అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశం భారత జట్టు సుదీర్ఘ సిరీస్ ఆడనున్నది. ఈ పర్యటనలో 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత భారత జట్టు నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నది. 2015 తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ వెళ్లడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత భారత జట్టు టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నది. ఇలా 2022లో పూర్తిగా బిజీగా గడపనున్నది. ఈ సిరీస్‌లు అన్నీ సజావుగా సాగాలంటే కరోనా తీవ్రత తగ్గాల్సిందే. ఇప్పటికే ఐపీఎల్ 2021 కరోనా కారణంగా వాయిదా పడింది. బయోబబుల్ ఏర్పాటు చేసినా ఆటగాళ్లకు కరోనా రావడంతో లీగ్ వాయిదా పడింది. 2022లో కరోనా తీవ్రత తగ్గితేనే ఈ సిరీస్‌లు అన్నీ జరుగనున్నాయి.

    ఇక ఈ ఏడాది కూడా టీమ్ ఇండియా వరుసగా సిరీస్‌లు ఆడుతున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటన ముగించి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగించింది. జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మధ్యలో వేరే జట్టు శ్రీలంకలో పర్యటించనున్నది. అక్టోబర్-నవంబర్‌లో టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పాల్గొననున్నది. అంటే భారత జట్టు ఇప్పటి నుంచి వచ్చే ఏడాది చివరి వరకు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతూనే ఉంటుంది.
    Published by:John Naveen Kora
    First published: