Home /News /sports /

TEAM INDIA WICKET KEEPER WRIDDHIMAN SAHA MADE SOME SHOCKING COMMENTS ON SOURAV GANGULY AND RAHUL DRAVID AFTER BEING DROPPED FROM TEST SQUAD SRD

Wriddhiman Saha : గంగూలీ, ద్రవిడ్ లపై సాహా సంచలన వ్యాఖ్యలు.. దాదా మాట తప్పారంటూ ఆవేదన..

Wriddhiman Saha (PC : BCCI)

Wriddhiman Saha (PC : BCCI)

Wriddhiman Saha : టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌ (India vs Sri Lanka)కు భారత జట్టును ప్రకటించారు. టెస్టు జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వం వహిస్తాడు. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టెస్టు సిరీస్‌ను 1-2తో ఓడిన త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కోహ్లీ (Virat Kohli) టెస్టు కెప్టెన్‌గా కూడా దిగిపోయాడు. దీంతో, టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అందరూ అనుకున్నట్టుగానే రోహిత్ శర్మకు అప్పగించాడు భారత సెలెక్టర్లు. ఇక, సీనియర్ ప్లేయర్లు ఛతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, పేసర్‌ ఇషాంత్‌ శర్మ, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాలను టెస్టు జట్టు నుంచి తప్పించారు. ఇక, టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)తనని రిటైర్మెంట్‌ గురించి ఆలోచించమని సూచించినట్లు సాహా బయటపెట్టాడు.

    భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పరిణామాలు శరవేగంగా మారిపోతోన్నాయని, ఏం జరుగుతున్నదో అర్థం కావట్లేదని అన్నాడు. వేగంగా మారుతోన్న పరిణామాలు, పరిస్థితులను తాను అర్థం చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో తనకు జట్టులో చోటు దక్కదనే విషయాన్ని మేనేజ్‌మెంట్ ముఖం మీదే తేల్చి చెప్పిందని అన్నాడు.

    ''ఇకపై జట్టు ఎంపికలో నన్ను పరిగణనలోకి తీసుకోబోమని టీమ్ మేనేజ్‌మెంట్ ముందే చెప్పింది. కోచ్ ద్రవిడ్ రిట్మైర్మెంట్ గురించి ఆలోచించాలని సూచించాడు. తాను బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం దేని గురించీ ఆలోచించాల్సిన పని లేదని దాదా తనతో చెప్పారు. కానీ పరిస్థితులు ఇంత వేగంగా ఎలా మారాయో నాకు అర్థం కావడం లేదు'' అని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఇది కూడా చదవండి :  టెస్టు జట్టులోకి వచ్చిన సౌరభ్ కుమార్ ఎవరు..? అతని ట్రాక్ రికార్డులేంటి..?

    గత నవంబరులో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో తాను 61 పరుగులు చేసినపుడు..దాదా ( Sourav Ganguly) అభినందించిన విషయాన్ని సాహా గుర్తుకు చేసుకున్నాడు. ఆ సమయంలో బీసీసీఐ ఛైర్మన్ సౌరభ్ గంగూలీ తనను అభినందిస్తూ మెసేజ్ చేశారని అన్నాడు. జట్టులో చోటుకు ఢోకా ఉండదనే భరోసా ఇచ్చారని అన్నాడు. ఆ తరువాతే బీసీసీఐలో ఏం జరిగిందో తనకు తెలియదని తెలిపాడు.

    రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయాన్ని తీసుకోవాలంటూ మేనేజ్‌మెంట్ తనను సూచించిందని వృద్ధిమాన్ సాహా తేల్చి చెప్పారు. కొందరు సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ కొత్త వికెట్ కీపర్ కోసం ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు తెలిపాడని, జట్టులో తనకు చోటు దక్కదనే విషయం అప్పుడే అర్థమైందని పేర్కొన్నారు. తనను జట్టులోకి తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణం- వయస్సు లేదా ఆటతీరు కానే కాదని ద్రవిడ్ చెప్పారని అన్నారు.


    జర్నలిస్టుపై సాహా సీరియస్...

    ఇదిలా ఉండగా...ఓ జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఈ సీనియర్ వికెట్ కీపర్. ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం బలవంతం చేశాడని..అయితే తాను స్పందించకపోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని సాహా వెల్లడించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను సాహా బయటపెట్టాడు. జర్నలిజం ఇంత దిగజారిపోయిందా.. అంటూ సాహా విచారణ వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా స్పందించాడు. దీనిపై తనదైన శైలిలో ఆ జర్నలిస్ట్ చెంచాగిరి చేశాడంటూ ఫైరయ్యాడు వీరేంద్రుడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, India vs srilanka, Rahul dravid, Rohit sharma, Sourav Ganguly, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు