Rishabh Pant : రిషభ్ పంత్ కామెంటరీకి నెటిజన్లు ఫిదా..మైక్ స్టంప్ ఆడియో ఇవ్వాలంటూ..

Rishabh Pant

Rishabh Pant : టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యాట్ పట్టుకుని మనోడు గ్రౌండ్ లోకి దిగాడంటే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. ఇక, వికెట్ల వెనుక రిషభ్ పంత్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

  • Share this:
    టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యాట్ పట్టుకుని మనోడు గ్రౌండ్ లోకి దిగాడంటే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. ఇక, వికెట్ల వెనుక రిషభ్ పంత్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. రిషభ్‌ పంత్ మైదానంలో ఉంటే ఆటగాళ్లకే కాదు అభిమానులకు ఎంతో సరదాగా ఉంటుంది. వికెట్ల వెనుక నుంచి పంత్‌ " కమాన్‌ యాష్"‌.. అంటుంటే అశ్విన్‌ రెట్టింపు ఉత్సాహంతో బంతులు వేస్తుంటాడు. అంతేకాదు, సహచర ఆటగాళ్లలో ఉత్తేజం నింపడానికి మధ్యలో పాటలు పాడుతుంటాడు. ఇక పంత్ చేసే అల్లరి చేష్టలకు ప్రత్యర్థులకు మతిపోతుంటుంది. కామెంటరీ కంటే ఎక్కువగా మాట్లాడుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చిరాకు తెప్పిస్తుంటాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ పంత్‌ అదే పని చేశాడు. దీంతో మైదానంలో చురుకుగా ఉంటున్న పంత్‌ గురించి నెట్టింట్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. కామెంటరీ బాక్సులో ఉన్న వ్యాఖ్యాతల కంటే పంతే ఎక్కువ కామెంటరీ చేస్తున్నాడని, అతడికి డబ్బులు చెల్లించాలని సరదాగా ట్వీట్‌లు చేస్తున్నారు. వీలైతే మైక్‌ స్టంప్‌ ఆడియో రికార్డును కొనుగోలు చేస్తామని, ఎందుకంటే అందులో పంత్ మాటలన్నీ ఉంటాయని కొందరు పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు ఐపీఎల్‌లో ఢిల్లీ ఆడని మ్యాచ్‌ల్లో పంత్‌తో కామెంటరీ చేయాలని కోరుతున్నారు.

    మరోవైపు రెండో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఫస్ట్ టెస్ట్‌లో క్యాచ్‌లు నేలపాలు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఈ యువ వికెట్ కీపర్.. సెకండ్ టెస్ట్‌లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ముందుగా బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించిన ఈ డాషింగ్ ప్లేయర్.. కీపింగ్‌లోనూ మైమరింపించాడు.








    మరోవైపు రెండో టెస్ట్ లో టీమిండియా పట్టు బిగుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన కోహ్లి సేన.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లిష్‌ జట్టును 134 పరుగులకే కట్టడిచేసింది. ఇప్పుడు భారీ లీడ్ దిశగా కొనసాగుతోంది భారత్. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ భారత్ టీమ్ పై గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.
    Published by:Sridhar Reddy
    First published: