Ind vs Aus: స్పైడర్​మ్యాన్​.. స్పైడర్​మ్యాన్ అంటూ పంత్​ పాట, ఫన్నీ కామెంట్లు - వీడియో

రిషబ్ పంత్ ( ICC / twitter)

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సంప్స్​ వెనుక ఓ పాట పాడాడు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

  • Share this:
    ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దుమ్మురేపుతున్నాడు. ఆటతో పాటు వికెట్ల వెనుక ఉంటూ బౌలర్లను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. పంత్ మాటలు, నవ్వుతో ఆసీస్ బ్యాట్స్​మెన్  అసహనానికి గురవుతున్నారు. ఒకానొక దశలో వేడ్​, పైన్ నోటికి పని చెప్పారు. అయినా పంత్ మాత్రం తన స్టయిల్​ను కొనసాగిస్తున్నాడు. వికెట్ల వెనుక నుంచి తన మాటలను కొనసాగిస్తున్నాడు.

    బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు పంత్ మరింత ఉత్సాహంగా కనపడ్డాడు. తన సింగింగ్ టాలెంట్​ను బయటపెట్టారు. స్పైడర్​మ్యాన్​, స్పైడర్​మ్యాన్ అని పాట పాడాడు. ఇది స్టంప్ మైక్​లో రికార్డు అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్ పైన్​, కామెరూన్ క్రీజులో ఉన్న సమయంలో రిషబ్ పాట పాడాడు.

    టీవీల్లో ఈ వీడియో చూసిన అభిమానులు ఎంతో ఖుషీ అయ్యారు. కాగా ఈ వీడియోను ఓ అభిమాని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. స్టంప్స్  వెనుక పంత్​ స్పైడర్​మ్యాన్​, స్పైడర్​మ్యాన్ అని పాడుతున్నాడు అంటూ ట్వీట్ చేశారు.

    Forget Spiderman, he goes :Tune Churaya mere dil ka chain after that.


    దీంతో పంత్ పాట వీడియో వైరల్​గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ విచిత్రమైన కామెంట్లతో హోరెత్తించారు. పంత్ మాత్రమే ఇలా చేయగలడని కామెంట్లు చేస్తున్నారు. పాటతో మనసు దోచేశావని మరికొందరు స్పందిస్తున్నారు. ఇక మీమ్స్​కైతే లెక్కే లేకుండా పోయింది. ఆస్ట్రేలియా టూర్​లో ఇది కూడా ఎప్పటికి గుర్తుంచుకునే విషయమని అంటున్నారు.

    Rishabh Pant casually singing "Spiderman Spiderman" behind the stumps has to be one of the moments of the summer. GOLD!!😂😂😂#AUSvIND

    pic.twitter.com/u5Q6pd6iIW

    This has got to be the most entertaining test series😂 @RishabhPant17 #AUSvsIND #RishabhPant pic.twitter.com/Hl7jMdPzqW

    కాగా నాలుగో రోజు 294 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా.. టీమిండియాకు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భారత్​ వికెట్లేమీ కోల్పోకుండా నాలుగు పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (1), శుభ్​మన్ గిల్​ (0) క్రీజులో ఉన్నారు. చివరి రోజు టార్గెట్ ఛేదిస్తే ఇక సిరీస్​ భారత్ సొంతమైనట్టే. ఒకవేళ డ్రా చేసుకున్నా బోర్డర్ గవాస్కర్​ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది.
    Published by:Krishna P
    First published: