TEAM INDIA WICKET KEEPER RISHABH PANT SHINES IN ESPNCRICINFO AWARDS FOR 2021 SRD SJN
Rishabh Pant : రిషభ్ పంత్‌ను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు... కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అతడికే...
Rishabh Pant
Rishabh Pant : టీమిండియా పాకెట్ డైనమైట్ రిషబ్ పంత్ ను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అలాగే, ఇతర దేశాలకు చెందిన ప్లేయర్లు కూడా అవార్డులు సొంతం చేసుకున్నారు.
టాప్ స్పోర్ట్స్ వెబ్సైట్ (Top sport Website) ఈస్పీఎన్ క్రిక్ఇన్ఫో (ESPN Cricinfo) ప్రకటించిన అవార్డుల్లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) మెరిశాడు. స్టోర్ట్స్కు సంబంధించి ఈస్పీఎన్ క్రిక్ఇన్ఫో 15వ ఎడిషన్ అవార్డు ( 15th edition of the ESPNcricinfo Awards)ల్లో రిషభ్ పంత్ పురుషుల విభాగంలో టెస్టు బ్యాటింగ్ (Test batting awrd) అవార్డును సొంతం చేసుకునన్నాడు. 20 మంది మాజీ క్రికెటర్లతో కూడిన జ్యూరి 2021కు సంబంధించి బెస్ట్ టెస్టు బ్యాటింగ్ అవార్డుకు రిషభ్ పంత్‌ను ఎంపిక చేసింది.
పంత్ ఆడిన ఏ ఇన్నింగ్స్‌కు వచ్చిందంటే...
2021 జనవరిలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గాబా టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో 329 పరుగులు చేజ్ చేసే క్రమంలో పంత్ 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను ఆసీస్‌పై ఒంటి చేత్తో గెలిపించాడు. టెస్టుల్లో 329 పరుగులను చేజ్ చేయడం అంటే ఎప్పుడూ కష్టమే... అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్ మీద అంటే మరీ కష్టం. అయినా సరే పంత్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు. అంతేకాకుండా గాబాలో 32 ఏళ్లుగా ఆసీస్ టెస్టు ఓడిపోలేదు. అయితే ఆ రోజు సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిసిన పంత్ 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు తొలిసారి గాబాలో టెస్టు ఓటమిని రుచి చూపించాడు.
కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అతడికే...
2021 సంవత్సరానికి గానూ కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును న్యూజిలాండ్ సారథి కేన్ (Kane Williamson)విలియమ్సన్ అందుకున్నాడు. 2021లో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (World Test Championship)ను కివీస్ గెలుచుకోవడంలో అతడి పాత్ర ఎంతో ఉంది. అంతేకాకుండా అనంతరం జరిగిన టి20 ప్రపంచ కప్ (T20 World Cup)లో కివీస్‌ను ఫైనల్ వరకు చేర్చాడు. దాంతో జ్యూరీ సభ్యులు అతడికే జై కొట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.