TEAM INDIA WHO WILL PLAY THIS TIME INDIAN TEAM PREDICTED SQUAD FOR WEST INDIES SERIES EVK
Team India: ఈ సారి ఎవరు ఆడతారో.. వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు అంచనా ఇదే!
టీం ఇండియా
Predicted Squad For West Indies Series | దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఆపై వన్డేల్లో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో టీం ఇండియా ఫ్యాన్స్ పూర్తిగా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఆ జట్టు ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చింది. త్వరలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇండియాకు రానుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా జట్టు అంచనా..
దక్షిణాఫ్రికా (South Africa) పర్యటనలో భారత్ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఆపై వన్డేల్లో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో టీం ఇండియా (Team India) ఫ్యాన్స్ పూర్తిగా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఆ జట్టు ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చింది. త్వరలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇండియాకు రానుంది. ఈ సారి సిరీస్ హోం గ్రౌండ్లో జరుగునుడడంతో ఫ్యాన్స్ టీం ఇండియా నుంచి బెస్ట్ పర్ఫామెన్స్‌ను ఆశిస్తున్నారు. వెస్టిండీస్ (West Indies) తో టీం ఇండియాకు మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత బోర్డు త్వరలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి రావడం టీం ఇండియాలో పెద్ద మార్పు.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) , జడేజా రావడంతో జట్టు పుంజుకొనే అవకాశం ఉందని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఈ సిరీస్‌లో టీం ఇండియా ఆటతీరుపై ఫ్యాన్స్ పెద్ద ఆశలే పెట్టుకొన్నారు. అందరి కన్నా.. ఎక్కువగా టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పై ఉంది. విరాట్ ఎప్పుడెప్పుడు సెంచరీ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా దక్షిణాఫ్రికాలో అంచనాలను అందుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్‌కు ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఇప్పుడు సరిగా రాణించకుంటే శ్రేయాస్ కెరీర్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతే కాకుండా దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు విరామం లభించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం జట్టు అంచనాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ జట్టు అంచనా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆరాట పడుతున్నారు. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం జట్టు తుది కూర్పు ఎలా ఉండబోతుందో అని క్రికెట్ వర్గాలు తేల్చేసాయి.
వెస్టిండీస్ సిరీస్ కోసం భారత జట్టు అంచనా : రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్ (WK), ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.