విరాట్ కోహ్లీ (virat kohli) సోమవారం నమీబియాతో కెప్టెన్‌గా తన చివరి T20I ఆడిన విషయం తెలిసిందే అంతే కాకుంఆ టి20 ప్రపంచకప్ 2021లో సూపర్ 12 దశ నుంచే వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ సిరీస్‌తో బిజీ కానుంది. కివీస్‌తో మొదట మూడు టి20లు ఆడనున్న టీమిండియా తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ (BCCI) బుధవారం టి20, టెస్టు జట్టును ప్రకటించనుంది. కాగా టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి వైదొలిగిన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రోహిత్‌కు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం. ఇక వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. టి20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలపై వేటు పడే అవకాశం ఉంది.
వైస్ కెప్టెన్‌గా రాహుల్..
ఈ విషయం పక్కనబెడితే.. విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌తో జరగనున్న టి20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. అయితే తర్వాతి రెండు టెస్టుల్లో మాత్రం కోహ్లి ఆడే చాన్స్ ఉంది.
T20 World CUP 2021 : టీ20 ప్రపంచ కప్‌లో టీం ఇండియా వైఫల్యానికి కారణం ఇదే : కపిల్‌దేవ్
ఈ నేపథ్యంలో రోహిత్ తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. స్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానేకే తొలి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక టి20ల్లో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కోహ్లితో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు దూరంగా ఉండే అవకాశమున్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది.
సత్తా చాటిన వారికే అవకాశం..
అయితే టి20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వరుణ్ చక్రవర్తి స్థానంలో ఐపీఎల్ 2021 పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్‌కు చాన్స్ ఇచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలిసింది. ఇక టి20 ప్రపంచకప్‌కు టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న దీపక్ చహర్, శ్రేయాస్ అయ్యర్‌లు తుది జట్టులో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలిసింది. చహల్ విషయమై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 17, 19, 21వ తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక నవంబర్ 25-29 వరకు కాన్పూర్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New Zealand, Rohith sharma, T20, Virat kohli