Home /News /sports /

TEAM INDIA VETERAN SPINNER HARBHAJAN SINGH ANNOUNCES RETIREMENT FROM ALL FORMS OF CRICKET AND HIS TWEET GOES VIRAL SRD

Harbhajan Singh : అన్ని రకాల క్రికెట్ భజ్జీ గుడ్ బై.. రిటైర్ అవ్వడానికి కారణం అదేనా..?

Harbhajan Singh

Harbhajan Singh

Harbhajan Singh : టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ ((Harbhajan Singh international cricket) కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అసలు భజ్జీ రిటైర్ అవ్వడానికి కారణం అదేనా..?

  టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు అన్ని రకాల క్రికెట్ కు ((Harbhajan Singh international cricket) కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ట్విటర్ వేదికగా భజ్జీ తన నిర్ణయాన్ని తెలిపాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు టర్బోనేటర్. " నా 23 ఏళ్ల కెరీర్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ లాంగ్ జర్నీలో నాకు సహాయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు" అంటూ ట్వీట్ చేశాడు. హర్భజన్​ సింగ్ చివరి సారిగా 2015లో ఇంటర్నేషనల్​ మ్యాచ్​లో అడాడు. ప్రస్తుతం భజ్జీ వయసు 41 సంవత్సరాలు. తన వయసును దృష్టిలో ఉంచుకుని ఇక ముందు అంతర్జాతీయ మ్యాచ్​లో ఆడే అవకాశం లేదని హర్భజన్​ భావించాడు. టీమ్​ ఇండియా అత్యుత్తమ స్పిన్నర్లలో హర్భజన్​ సింగ్ కూడా ఒకరు.

  23 ఏళ్ల క్రితం 1998లో ఆస్ట్రేలియాలో మార్చి 25న జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు హర్భజన్ సింగ్. రెండు రంజీ ట్రోఫీల్లో 8 వికెట్లు తీసిన భజ్జీని ఆసీస్ టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు.టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చిన హర్భజన్ సింగ్, సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోనూ ఆడాడు. అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత భజ్జీ కెరీర్‌ ఊపందుకుంది.


  103 టెస్టుల్లో 417 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్, టెస్టుల్లో రెండు సెంచరీలు, 9 హాఫ్ హాఫ్ సెంచరీలతో 2224 పరుగులు కూడా చేశాడు.236 వన్డే మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్, 269 వికెట్లు తీశాడు. 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీసి... ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు.ఐపీఎల్ 163 మ్యాచుల్లో 150 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ టీమ్‌లలో సభ్యుడిగా ఉన్నాడు.

  2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన హర్భజన్ సింగ్, భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు.2001, మార్చి 11న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించిన భజ్జీ, అదే మ్యాచ్‌లో మాథ్యూ హేడెన్, మార్క్ వాగ్, స్టీవ్ వా, జాసన్ గిలెస్పీ వికెట్లు తీశాడు.

  ఇది కూడా చదవండి : మరో రెండు అరుదైన రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మూడు మ్యాచులు ఆడితే..

  గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ప్రధాన స్పిన్నర్‌గా మారిన హర్భజన్ సింగ్, ఆ తర్వాత అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీలోనూ ఆడాడు.చివరిగా భారత జట్టు తరుపున 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగిన హర్భజన్ సింగ్ 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.

  ఐపీఎల్ కోచ్ అయ్యేనా..?

  అయితే ఆ తర్వాత హర్భజన్ సింగ్‌కి ఐదేళ్లుగా టీమిండియాలో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తున్నా, భారత జట్టు సెలక్టర్లు భజ్జీని పట్టించుకోలేదు... 41 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుని, ఐపీఎల్‌లో బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  రాజకీయాల్లోకి ఎంట్రీ..?

  పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో హర్భజన్​ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు (Harbhajan Singh to Join Politics) వార్తలొస్తున్నాయి. ఇటీవల అతడు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూను కలిశాడు. దీనితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే వార్తలకు మరింత బలం చేకూరింది.ఇంతకు ముందు కూడా హర్భజన్​ సింగ్ బీజేపీలో చేరుతాడనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని భజ్జీ తిరస్కరించడం గమనార్హం.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Harbhajan singh, Team india

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు