Home /News /sports /

TEAM INDIA TO PLAY ONE OFF TEST AGAINST ENGLAND IN JULY SERIES DECIDER DECISSION WILL BE TAKEN BY ICC LATER JNK

IND vs ENG: వచ్చే ఏడాది జులైలో ఏకైక టెస్ట్ ఆడనున్న ఇంగ్లాండ్-ఇండియా.. అది సిరీస్ డిసైడరేనా?

ఇంగ్లాండ్ - ఇండియా మధ్య వచ్చే ఏడాది జులైలో ఏకైక టెస్టు (PC: ECB)

ఇంగ్లాండ్ - ఇండియా మధ్య వచ్చే ఏడాది జులైలో ఏకైక టెస్టు (PC: ECB)

ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య రద్దైన మాంచెస్టర్ టెస్టు బదులు జులై 2022లో ఏకైక టెస్టు ఆడేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇది సిరీస్ డిసైడర్‌లో భాగంగా జరుగుతుందా లేదా విడిగా ఏకైక టెస్టు సిరీస్‌గా పరిగణిస్తారా అనేది ఐసీసీ నిర్ణయించనున్నది.

ఇంకా చదవండి ...
    ఇంగ్లాండ్ పర్యటనకు (England tour) వెళ్లిన భారత జట్టు (Team India) ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. చివరి టెస్టుకు ముందు జట్టులో కరోనా (Covid 19) కేసులు బయటపడటంతో అర్దాంతరంగా సిరీస్ నిలిచిపోయింది. అప్పటికే ఇండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నది. కానీ చివరి టెస్టు జరగకపోవడంతో సిరీస్ ఎవరు గెలిచారనేది ఇంత వరకు తెలియలేదు. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) (ECB), బీసీసీఐ (BCCI) అధికారులు సమావేశం అయ్యారు. నాలుగో టెస్టును రద్దు చేయాలని బీసీసీఐ కోరింది. తొలుత ఇండియా వాకోవర్ ఇస్తున్నట్లు ఈసీబీ పేర్కొన్నా.. ఆ తర్వాత మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సిరీస్‌ను ఇండియా గెలిచినట్లు ప్రకటించకుండా ఈసీబీ తమ నిర్ణయాన్ని ఐసీసీ ముందు ఉంచింది. దీంతో అప్పటి నుంచి సందిగ్దత నెలకొన్నది.

    తాజాగా ఈసీబీ, బీసీసీఐ కలసి ఒక నిర్ణయానికి వచ్చాయి. 2022 జులైలో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ నిర్వహించాలని భావిస్తున్నాయి. మాంచెస్టర్‌లో రద్దయిన 5వ టెస్టుకు రిప్లేస్‌మెంట్‌గా ఈ టెస్టును నిర్వహించేందుకు ఇరు బోర్డులు అంగీకారానికి వచ్చాయి. అయితే ఇది సిరీస్ డిసైడర్‌గా ఉంటుందా లేదా అనే విషయాన్ని ఐసీసీ తేల్చనున్నది. తమ ప్రతిపాదనను ఇప్పటికే ఇరు క్రికెట్ బోర్డులు ఐసీసీకి తెలిపాయి. అయితే కాస్త సమయం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ చెప్పింది. జులై నెలలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ ఆడనున్నది. అయితే టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన తేదీని ఇంకా నిర్ణయించలేదు. వాస్తవానికి టెస్టు మ్యాచ్‌కు బదులుగా టీమ్ ఇండియా మరో రెండు టీ20 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడుతుందని బీసీసీఐ చెప్పింది. అంతే కాకుండా టెస్టు మ్యాచ్ ఆడాలంటే అది ప్రత్యేక టెస్టుగా ఉండాలి కానీ ముగిసిపోయిన సిరీస్‌లో భాగంగా ఉండొద్దని కూడా వాదించింది. ఇటీవల ముగిసిన సిరీస్ ఇండియా గెలిచినట్లు ప్రకటించాలని కోరింది. దీనికి ఈసీబీ ససేమిరా అనడంతో ఇరు బోర్డులు ఐసీసీ నిర్ణయానికి వదిలేశాయి.

    Team India: కోహ్లీసేనకు దొరికిన 'వరుణాస్త్రం'.. పొట్టి ప్రపంచకప్‌లో ప్రధాన అస్త్రంగా మారనున్న వరుణ్ చక్రవర్తి?


     వాస్తవానికి మాంచెస్టర్ టెస్టు ఆడటానికి టీమ్ ఇండియా తుది జట్టుకు సరిపడా ఆటగాళ్లు ఉన్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ వర్మ తమ కుటుంబాలు, పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని భయపడినట్లు తెలుస్తున్నది. అందుకే తొలుత ఆడతామని చెప్పిన ఆటగాళ్లు... ఆ తర్వాత మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. మరోవైపు కరోనా కేసులు బయటపడటానికి టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ బయోబబల్ నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని ఈసీబీ చెబుతున్నది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఈసీబీ భారీగా నష్టపోయింది. అందుకే చివరి టెస్టు విషయంలో ఇంగ్లాండ్ గుర్రుగా ఉన్నది.

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, ICC, India vs england, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు