TEAM INDIA TEST SERIES WIN GAUTAM GAMBHIR RATES VIRAT KOHLI AS BETTER TEST CAPTAIN THAN SOURAV GANGULY AND MS DHONI NK
గంగూలీ, ధోనీ కంటే కోహ్లీయే బెటర్ టెస్ట్ కెప్టెన్ : గౌతం గంభీర్
విరాట్ కోహ్లీ (credit - twitter - BCCI)
Virat Kohli : సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ సారధ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్‌తోపాటూ... 137 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. 254 పరుగులతో విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. ఈ విజయం తర్వాత గౌతం గంభీర్... విరాట్ కోహ్లీ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు.
Virat Kohli : టీమిండియా, సౌతాఫ్రికాతో పుణెలో జరిగిన రెండో వన్డేలో... భారత్... ఇన్నింగ్స్‌తోపాటూ... 137 పరుగుల భారీ విజయాన్ని దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఫాలోఆన్‌లో సౌతాఫ్రికా 189 పరుగులకే చాప చుట్టేసింది. తద్వారా టీమిండియా... సొంత గడ్డపై వరుసగా 11వ సారి టెస్ట్ సిరీస్ గెలుచుకున్నట్లైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా 254 పరుగులు చేసి... ఏడో డబుల్ సెంచరీ నమోదుచేశాడు. ఫలితంగా ఇండియా 5 వికెట్ల నష్టానికి 601 పరుగులతో డిక్లేర్ చేసింది. ఈ భారీ స్కోర్ చూసి ఫ్యాన్స్తోపాటూ... నిపుణులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విజయం తర్వాత... గౌతం గంభీర్... విరాట్ కోహ్లీ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. తన సీనియర్ల కంటే... కోహ్లీ ఏ విధంగా బెస్ట్ కెప్టెనో వివరించాడు.
"ఓటమి భయంతో ఉంటే... విజయం సాధించలేరు. అదే విరాట్ కోహ్లీకి ప్లస్ పాయింట్. తను ఎప్పుడూ ఓటమికి భయపడడు" అని గంభీర్ టెస్ట్ మ్యాచ్ తర్వాత అభిప్రాయపడ్డాడు. గంభీర్... కోహ్లీని సౌరవ్ గంగూలీ, ధోనీ కంటే బెటర్ కెప్టెన్‌గా చెబుతున్నా్డు. ఎందుకంటే... అతని కెప్టెన్సీలో టీమిండియా... సొంత గడ్డతోపాటూ... విదేశాల్లోనూ టెస్ట్ మ్యాచ్‌లు గెలవగలుగుతోందని వివరించాడు.
"మిగతా కెప్టెన్లు తీసుకోని రిస్క్... విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. వాళ్లు ప్రతిసారీ ఎక్ట్స్ట్రా బ్యాట్స్‌మన్‌ను అడిగేవాళ్లు. అందువల్ల వాళ్లు మ్యాచ్ ఓడిపోయేవాళ్లు కాదు. విరాట్ అలా కాదు. తను విదేశాలకు ఐదుగురు బౌలర్లు ( హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్)తోనే వెళ్లేవాడు" అని గంభీర్ తెలిపాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత... మరిన్ని సిరీస్‌లు గెలవాలనే కసి ఆ జట్టులో పెరిగిందన్నాడు.
గత మూడు నాలుగేళ్ల నుంచీ మనకు ఇలాంటి ప్లేయర్లు ఉండటం మన అదృష్టం. వాళ్లలో ఎంతో కసి ఉంది. ఆటపై నిబద్ధతతో ఉన్నారు. ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటున్నారు.
— మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ (టెస్ట్ సిరీస్ విజయం తర్వాత)
టెస్ట్ చాంఫియన్‌షిప్ వరకూ చూస్తే... టీమిండియా 4 విజయాలు సాధించి... 200 పాయింట్లతో టాప్ పొజిషన్లో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.