Home /News /sports /

TEAM INDIA TEST BATTER CHETESHAWAR PUJARA HITS 4 2 4 2 6 4 AND 73 BALL CENTURY IN ROYAL LONDON ODI CUP SJN

Cheteshwar Pujara : 4, 2, 4, 2, 6, 4.. ప్రత్యర్థి బౌలర్ ను కుమ్మేసిన పుజారా.. (వీడియో)

PC : TWITTER/Cheteshwar Pujara

PC : TWITTER/Cheteshwar Pujara

Cheteshwar Pujara : నెమ్మదిగా ఆడే భారత టెస్టు బ్యాటర్ చతేశ్వర్ పుజారా ( Cheteshwar Pujara ) రెచ్చిపోయాడు. టి20 తరహా షాట్లతో ప్రత్యర్థిని వణికించేశాడు. టీమిండియా (Team india) టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కించుకుంటున్న పుజారా.. ప్రస్తుతం ఇంగ్లండ్ (England) వేదికగా జరుగుతోన్న రాయల్ లండన్ వన్డే కప్  (Royal London Odi Cup)లో విఖ్యాత టీం సస్సెక్స్ (Sussex)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    Cheteshwar Pujara : నెమ్మదిగా ఆడే భారత టెస్టు బ్యాటర్ చతేశ్వర్ పుజారా ( Cheteshwar Pujara ) రెచ్చిపోయాడు. టి20 తరహా షాట్లతో ప్రత్యర్థిని వణికించేశాడు. టీమిండియా (Team india) టెస్టు జట్టులో మాత్రమే చోటు దక్కించుకుంటున్న పుజారా.. ప్రస్తుతం ఇంగ్లండ్ (England) వేదికగా జరుగుతోన్న రాయల్ లండన్ వన్డే కప్  (Royal London Odi Cup)లో విఖ్యాత టీం సస్సెక్స్ (Sussex)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో వార్విక్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో తన శైలికి భిన్నంగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ మ్యాచ్ లో పుజారా బ్యాటింగ్ చూసిన వారికి ఇతడిలో టి20 ప్లేయర్ కూడా ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది.

    ఇది కూడా చదవండి : సరికొత్త ఫార్మాట్ లో ఆసియా కప్ టోర్నీ.. అసలైన మజా వచ్చేది అప్పుడే కదా.!

    తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ 50 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్‌ రాబర్ట్‌ యేట్స్‌ 114 పరుగులతో మెరుపు శతకం అందుకోగా.. కెప్టెన్‌ రోడ్స్‌ 76, మైకెల్‌ బర్గెస్‌ 58 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సస్సెక్స్ ను పుజారా ముందుండి నడిపించాడు. కేవలం 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో లియామ్‌ నార్వెల్‌ వేసిన ఆ ఓవర్లో పుజారా 4,2,4,2,6,4తో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే చివర్లో పుజారా అవుట్ కావడంతో సస్సెక్స్ విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. మ్యాచ్ ల ో పుజారా  79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. ప్రస్తుతం నెట్టింట్లో పుజారా 47వ ఓవర్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

     ససెక్స్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. పుజారా, అలిస్టర్‌ ఓర్‌(81 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు ససెక్స్‌ విజయం దిశగానే సాగింది. అయితే పుజారా ఔటైన అనంతరం మిగతావారు రాణించడంలో విఫలం కావడంతో గెలుపుకు దగ్గరగా వచ్చి బోల్తా పడింది. ఇక పాయింట్ల పట్టికలో వార్విక్‌షైర్‌ 4 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి ఆరో స్థానంలో ఉండగా.. వార్విక్‌షైర్‌ 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగో స్థానంలో ఉంది.
    Published by:N SUJAN KUMAR REDDY
    First published:

    Tags: Cheteswar Pujara, Dinesh Karthik, KL Rahul, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Sanju Samson, Shikhar Dhawan, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు