IND vs SA : నేడు ఇండియా - దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ 20..

IND vs SA : ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య ఈ రోజు రెండో టీ 20 ప్రారంభం కానుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ పూర్తిగా వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్‌కు మొహాలీ వేదిక కానుంది. వెస్టిండీస్‌తో సిరీస్‌ ను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసిన టీమిండియా ఈసారి కూడా అదే దూకుడుతో ఆడాలని ఉవ్విళ్లూరుతోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 18, 2019, 10:52 AM IST
IND vs SA : నేడు ఇండియా - దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ 20..
సైనీ, ధవన్
  • Share this:
ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య ఈ రోజు రెండో టీ 20 ప్రారంభం కానుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ పూర్తిగా వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్‌కు మొహాలీ వేదిక కానుంది. వెస్టిండీస్‌తో సిరీస్‌ ను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసిన టీమిండియా ఈసారి కూడా అదే దూకుడుతో ఆడాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు చాలా తక్కువ మ్యాచ్‌లు ఉండటంతో ఈ సిరీస్‌ను బాగా ఉపయోగించుకోవాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు, బ్యాటింగ్‌ లైన్‌పకు వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినా, రిషబ్ పంత్ ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచుతున్నా దానికి తగ్గట్లు ఆడటం లేదు. క్రీజులో కుదురుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వికెట్‌ను పారేసుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా, ఓపెనర్ శిఖర్ ధవన్ ఆటతీరుపైనా ఆందోళన నెలకొంది. విండీస్‌తో సిరీస్‌లో రాణించలేకపోయిన గబ్బర్.. ఈ సిరీస్‌లో రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. అటు బౌలింగ్ పరంగా చూసుకుంటే.. కుల్దీప్‌, చాహల్‌ స్థానంలో వచ్చిన రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పైనా కీలక బాధ్యత ఉంది.

జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్‌, ధవన్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్, పంత్‌, హార్దిక్‌, కృనాల్‌, జడేజా, వాషింగ్టన్‌/రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, సైనీ
దక్షిణాఫ్రికా: డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, బవుమా, వాన్‌డర్‌ డుస్సెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌, బోర్న్‌ ఫర్టూన్‌/ఎన్‌రిచ్‌ నోర్టే, రబాడ, జూనియర్‌ దాలా, షంసీ
Published by: Shravan Kumar Bommakanti
First published: September 18, 2019, 10:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading