ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ బాగా నిరాశకు గురైన సిరీస్ టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021). ఇండియన్ టీం పేలవమైన ప్రదర్శనతో ఇంటి బాట పట్టింది. కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోయింది. దీనిపై ఫ్యాన్స్ బాగా బాధ పడ్డారు. వరల్డ్ కప్ ముగిసిన 20 రోజుల్లోపే టీం ఇండియా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో ఆద్యంతం అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తూ సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చి. న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 20 రోజుల్లో ఎంత మార్పు. అసలు వరల్డ్‌కప్‌లో టీం ఇండియా ఫైల్యానికి కారణం ఏంటీ.. అదే వరల్డ్‌కప్‌లో ఇండియాను ఓడించి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ (New Zealand)ను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది. ఈ విజయానికి కారణం ఏంటీ జట్టు ఆట తీరులో మార్పుకు కారణం ఏంటీ.
వైఫల్యానికి కారణం..
ఐపీఎల్-2021 మలి దశ ముగిసిన తర్వా త ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా టీ 20 సిరీస్‌కు వచ్చారు. దీంతో ఆటతీరుపై తీవ్ర ప్రభావం పడింది. రెండోది దుబాయ్‌లో మ్యాచ్‌లు జరగడం టీం ఇండియాకు ఇబ్బందిగా మారింది.
Uttar pradesh Elections: ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి.. పార్టీల పరిస్థితి.. వ్యూహాలు
దాదాపు అన్ని మ్యాచ్‌లు టాస్ గెలిచిన వాళ్లే గెలిచారు. అంటే అర్థం చేసుకోండి మ్యాచ్ ఆట తీరుకంటే టాస్ డామినేట్ చేసింది. దీంతో విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం టీంకు నష్టం జరిగింది.
సీనియర్లు దాదాపు అన్ని మ్యాచ్‌లలో విఫలం చెందారు. దీంతో సరైన ఫలితం రాలేదు. విరాట్ కోహ్లీ విజయవంతమైన కెప్టెన్ అయినప్పటికీ టీ20 సిరీస్‌లో జట్టు కూర్పులో లోపాల కారణంగా సరైన ప్రదర్శన రాలేదు. దీంతో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టీం ఇండియా సెమీస్ చేరకపోవడం బాధాకరమన్నారు. కొం తమం ది ఆటగాళ్లు ఇం డియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి ఎక్కు వగా ప్రాధాన్యం ఇస్తుం డటం వల్లే టీమ్ఇం డియా పరిస్థితి ఇలా తయారయ్యిం దని ఆవేదన వ్య క్తం చేశారు.
ఏం మార్పు జరిగింది..
టీ20 సిరీస్ తరువాత టీం కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకొన్నాడు. రవిశాస్త్రీ పదవీ కాలం ముగియడంతో రాహుల ద్రావిడ్‌ను టీం కోచ్‌గా నియమించారు. ద్రావిడ్ రాకతో టీంలో సీరియస్ నెస్ ఏర్పాడింది. అంతే కాకుండా సీనియర్ ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి నిచ్చారు. దీంతో జూనియర్ ప్లేయర్లు తమను నిరుపించుకోవడానికి తాపత్రయ పడ్డారు. ఆది ఆట తీరులో స్పష్టం కనిపించింది. కొత్త బోలర్లు, బ్యాట్స్‌మెన్ వంద శాతం ఎఫెర్ట్ పెట్టి ఆడారు. ఈ కారణంగా జట్టు అన్ని విభాగాల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ ఆట తీరు టీ20 వరల్డ్ కప్‌లో ఆడి ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ పలు చోట్ల కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైన టీం ఇండియా మళ్లీ మునుపటి ఫాంలోకి రావడంపై ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs nz t20 series, Rahul dravid, Rohit sharma, T20, T20 World Cup 2021