హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India : రామ్ చరణ్ ఇంటికి టీమిండియా స్టార్ ప్లేయర్స్.. హార్దిక్ తో పాటు..!

Team India : రామ్ చరణ్ ఇంటికి టీమిండియా స్టార్ ప్లేయర్స్.. హార్దిక్ తో పాటు..!

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Team India : టీమిండియా స్టార్ ప్లేయర్లు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట సందడి చేశారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్, రోహిత్, కోహ్లీలు చెర్రీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) సొంతగడ్డపై దుమ్మురేపుతుంది. పొట్టి క్రికెట్ లో విజయాలు సొంతం చేసుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది. ఉప్పల్ వేదికగా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మూడో టీ20 మ్యాచ్ భారతే విజయాన్ని ముద్దాడింది. మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. 187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసి మరో బంతి మిగిలి ఉండగానే నెగ్గింది. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్ ను ఫోర్ తో ముగించేశాడు.

  అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత స్టార్ క్రికెటర్స్ హార్థిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ సహా మరికొందరు ప్లేయర్స్.. రామ్ చరణ్‌ ఇంట సందడి చేశారు. మ్యాచ్ తర్వాత మెగా పవర్ స్టార్ ఇంటికి వెళ్లారు టీమిండియా స్టార్ క్రికెటర్లు. చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా వారు కలిశారు. ఇందుకు సంబంధించి మెగా ఫ్యామిలీ సన్నిహితులు పాండ్యాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

  హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు ఆటగాళ్లతో రామ్ చరణ్‌-ఉపాసన దంపతులు కాసేపు సరదాగా మాట్లాడారట. భారత క్రికెటర్ల కోసం చరణ్‌ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పార్టీలో పాల్గొన్నారని సమాచారం. ఈ పార్టీ ఫొటోలను మెగా పవర్ స్టార్ ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా షేర్‌ చేయనున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

  ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మ్యాచ్ అనంతరం రామ్ చరణ్‌ను కలిసేందుకు.. ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav), హార్థిక్ పాండ్యా (Hardik Pandya)తో పాటు మరికొంత మంది ప్లేయర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

  View this post on Instagram

  A post shared by MR.C (@ramcharan_era)

  ఇక, టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన 'రామ్ చరణ్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించారు. 'మగధీర' సినిమాతో స్టార్ హోదాను అందుకున్న చరణ్.. 'రంగస్థలం' చిత్రంతో మరో మెట్టు ఎక్కారు. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

  View this post on Instagram

  A post shared by MR.C (@ramcharan_era)

  ప్రస్తుతం మెగా పవర్ స్టార్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఇక, 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వారిద్దరి యాక్టింగ్‌కు ఇండియన్‌ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో చెర్రీని టీమిండియా స్టార్ ప్లేయర్లు కలిసినట్లు తెలుస్తోంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Hardik Pandya, India vs australia, Ramcharan, Rohit sharma, Team India, Tollywood, Virat kohli

  ఉత్తమ కథలు