Rohit Sharma Love Story : " రితికాతో డేటింగ్.. వాళ్లకు చెప్పాలంటే చాలా భయమేసింది.."

Rohit Sharma Love Story

Rohit Sharma Love Story : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి భార్య రితికాచూడచక్కని జంట అనడంలో ఎలాంటి సందేహం లేదు. రితిక సింగ్ రోహిత్ శర్మ మేనేజర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతకాలం కాలం క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండి ఆ తర్వాత మరికొంతకాలం డేటింగ్‌లో గడిపి.. చివరిగా 2015లో పెళ్లి చేసుకున్నారు.

 • Share this:
  క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్(Dinesh Karthik), తనదైన స్టైల్‌లో అభిమానులను అలరిస్తున్నాడు. తొలి టెస్టు సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఇంటర్వ్యూ చేసి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకి తీసుకొచ్చిన కార్తీక్, ఇప్పుడు రోహిత్ శర్మ (Rohit Sharma)తో ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి భార్య రితికాచూడచక్కని జంట అనడంలో ఎలాంటి సందేహం లేదు. రితిక సింగ్ రోహిత్ శర్మ మేనేజర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొంతకాలం కాలం క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండి ఆ తర్వాత మరికొంతకాలం డేటింగ్‌లో గడిపి.. చివరిగా 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహానికి ముందు వీరు డేటింగ్‌లో ఉన్న విషయం చాలా సీక్రెట్‌గా ఉంచారు. తాజాగా టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌‌తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ విషయంపై నోరు విప్పాడు రోహిత్ శర్మ.

  రితికా సజ్దే‌తో ప్రేమాయణం గురించి దినేశ్ కార్తీక్ ప్రశ్నించగా.. ఆమె తన వద్ద మేనేజర్‌గా పనిచేసేదని, ఆ క్రమంలో ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమే తప్పా తమకు ఆ ఆలోచనే లేదని రోహిత్ బదులిచ్చాడు. "అప్పుడు ఇప్పుడు నా మేనేజర్ రితికా సజ్దేనే. ఆ క్రమంలో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మంచి స్నేహితులయ్యాం. ముందుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధంలేదు. అసలు మాకు ఆలోచన కూడా లేదు. కేవలం వర్క్‌కు సంబంధించిన రిలేషన్ తప్పా మరేది లేదు. కావాలంటే రితికా ఇక్కడే ఉంది అడగండి. అయితే మా మధ్య ఉన్న చనువు చూసి చాలా అనేవారు. కానీ మేం వాటిని పట్టించుకునేవాళ్లం కాదు.

  నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీరిద్దరూ క్యూట్ కపుల్‌గా ఉన్నారని, మీ ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనేవారు. నేను మాత్రం వాటిని తప్పుబట్టేవాడిని. అలాంటిదేం లేదని, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని గట్టిగా చెప్పేవాడిని. కానీ కొన్నాళ్లకు వారు చెప్పిందే నిజమైంది. అప్పుడు వాళ్లకు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచించేవాడిని. ఎందుకంటే వాళ్లు చాలా రోజుల ముందే ఈ విషయం చెప్పారు. అయితే అఫిషియల్‌గా మేమిద్దరం డేటింగ్ చేసిన కొన్నాళ్లకు ఎలాగోలా వాళ్లకు చెప్పేసాను. వారికి చెప్పడానికి భయం కాదు కానీ అదో విభిన్నమైన ఫీలింగ్.

  20 ఏళ్ల క్రితం నాకున్న చిన్ననాటి స్నేహితులు ఇప్పటికి నాతో టచ్‌లో ఉన్నారు. వారితో కలవడం, తిరగడం చాలా ఇష్టం. నా ఆటను వాళ్లు ఇష్టపడుతారు. అతనే నిజాయితీగా నా తప్పులను కూడా చెబుతారు. ఏం షాట్ ఆడవని, నువ్వు తప్పుచేసావ్, మంచి చేసావ్ అని నా క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతారు. నేను కూడా వారితో అలానే ఉంటా. వారి వ్యక్తిగత విషయాలు నాతో పంచుకున్నప్పుడు కావాల్సిన సలహాలు కూడా ఇస్తాను. ఇప్పటికీ వాళ్లంతా నాతో టచ్‌లోనే ఉన్నారు. మా మధ్య అదే తరహా స్నేహం ఉంది." అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

  ఇక లార్డ్స్ వేదికగా జరుగతున్న సెకండ్ టెస్ట్‌లో ఓపెనర్లు లోకేశ్‌ రాహుల్‌ (248 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌ 127 బ్యాటింగ్), ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్‌ శర్మ (145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 83) భారీ స్కోరుకు పునాది వేశాడు.
  Published by:Sridhar Reddy
  First published: