Home /News /sports /

TEAM INDIA STAR BOWLER JASPRIT BUMRAH WIFE SANJANA GANESAN REVEALS SOME SECRETS ABOUT HER HUSBAND SRD

Jasprit Bumrah : మ్యాచ్ కు ముందు బుమ్రా ఏం చేస్తాడో తెలుసా..? సీక్రెట్స్ బయటపెట్టిన భార్య సంజనా..!

జస్ప్రీత్ బుమ్రా - సంజనా గణేశన్

జస్ప్రీత్ బుమ్రా - సంజనా గణేశన్

Jasprit Bumrah : ఈ ఏడాది మార్చిలో బుమ్రా, సంజనాలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

    టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah Latest News) భార్య సంజనా గణేశన్ (Sanjana Ganesan) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడూ తన గురించి, భర్త బుమ్రా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో బుమ్రా, సంజనాలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఇక, మయంతి లంగర్, స్టువర్ట్ బిన్నీ తర్వాత టీవీ రిపోర్టర్, క్రికెటర్ జోడిగా నిలిచారు బుమ్రా, సంజన. ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఈ ప్రేమపక్షులు యూఏఈలో ఉన్నారు. ముంబై బౌలింగ్ లైనప్ లో కీ బౌలర్ గా ఉన్నాడు బుమ్రా. ఈ సీజన్ లో MI తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బుమ్రా.. ఒక మ్యాచ్ లో రాణించకపోయినా తర్వాతి గేమ్ లో తిరిగి పుంజుకుంటాడు. అయితే మ్యాచ్ కు ముందు బుమ్రా దినసరి చర్య ఎలా ఉంటుంది..? అని తెలుసుకోవాలనుందా..? అయితే అతడి భార్య సంజనా గణేషన్ ఆ విషయాలను బయటపెట్టింది. యూఏఈలో అతడితోనే ఉంటున్న ఈ స్టార్ యాంకర్ Instagram వేదికగా ఈ విషయాలను బహిర్గతం చేసింది.

    "మ్యాచ్ కు ముందు బుమ్రా ప్రత్యేకంగా ఎలాంటి సెంటిమెంట్లూ, సంప్రదాయాలు ఫాలో కాడు. రిలాక్స్డ్ గా ఉంటాడు. ఆ రోజు చేయాల్సిన పనులన్నింటిపై అతడికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. గ్రౌండ్ కు వెళ్లే ముందు బస్ ఎక్కే టైమ్ కే బుమ్రా ఉదయం లేవడం, వ్యాయామాలు, ధ్యానం వంటి అన్ని పనులను పూర్తి చేసుకుంటాడు. కానీ మిగతా రోజుల్లో మాత్రం లంచ్ చేసే సమయం (మధ్యాహ్నం 2 గంటలకు) కు బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు " అని తెలిపింది.



    ఏదైనా మ్యాచ్ లో చెత్త ప్రదర్శన తర్వాత బుమ్రా ఎలా కోలుకుంటాడనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. "అలా జరిగిన రోజు అందుకు గల కారణాలను విశ్లేషించుకుంటాడు. తిరిగి పుంజుకోవడానికి సన్నద్దమవుతాడు. అందుకోసం ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుంటాడు. పడిన ప్రతిసారి అంతే స్పీడుగా రికవరీ కావడం బుమ్రాలో ఉన్న ప్రత్యేకత " అని చెప్పింది.

    ప్రస్తుతం ముంబై ఇండియన్ 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక, ప్రతి మ్యాచ్ వారికి డూ ఆర్ డై లాంటిదే. ఈ మ్యాచ్ ల్లో గెలవాలంటే జస్ప్రీత్ బుమ్రా రాణించాల్సిందే. ఇక, వచ్చే టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు తురుపు ముక్క లాంటి వాడు బుమ్రా. ఈ స్పీడ్ స్టార్ పై బోలెడు అంచనాలు ఉన్నాయ్. బుమ్రా.. సత్తా చాటితే టీమిండియా ధనాధన్ టోర్నీని తమ ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2021, Jasprit Bumrah, Mumbai Indians, Sanjana Ganesan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు