హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : వామ్మో.. బుమ్రాలో ఈ యాంగిల్ కూడా ఉందా.. హోటల్ రూంలో భార్య సంజనాతో సరసాలు..

Viral Video : వామ్మో.. బుమ్రాలో ఈ యాంగిల్ కూడా ఉందా.. హోటల్ రూంలో భార్య సంజనాతో సరసాలు..

జస్ప్రీత్ బుమ్రా - సంజనా గణేశన్

జస్ప్రీత్ బుమ్రా - సంజనా గణేశన్

Viral Video : పెళ్లైన తర్వాత జస్ప్రిత్ బుమ్రాలో చాలా మార్పు కనిపిస్తోంది. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో రహస్య ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకున్న జస్ప్రిత్ బుమ్రా... ఇప్పుడు భార్యతో కలిసి తన రొమాంటిక్ యాంగిల్ బయటపెడుతున్నాడు.

టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah Latest News) భార్య సంజనా గణేశన్ (Sanjana Ganesan) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడూ తన గురించి, భర్త బుమ్రా గురించి లేటెస్ట్ అప్ డేట్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో బుమ్రా, సంజనాలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఇక, మయంతి లంగర్, స్టువర్ట్ బిన్నీ తర్వాత టీవీ రిపోర్టర్, క్రికెటర్ జోడిగా నిలిచారు బుమ్రా, సంజన. ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2021 Season Latest News) కోసం ఈ ప్రేమపక్షులు యూఏఈలో ఉన్నారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కు ఆడిన బుమ్రా.. ప్రస్తుతం  టీ -20 వరల్డ్ కప్ కోసం టీమిండియాతో చేరాడు. ప్రస్తుతం క్వారంటైన్ లో గడుపుతున్నారు. ఇక, భారత జట్టులో చాలా రిజర్వు ప్లేయర్ అంటే జస్ప్రిత్ బుమ్రానే. చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. మహ్మద్ షమీ కూడా బుమ్రా చాలా నెమ్మదస్తుడని, సరదాకి ఏదైనా మాట అన్నా కూడా ఫీల్ అయిపోతాడని కామెంట్ చేశాడు.

అయితే పెళ్లైన తర్వాత జస్ప్రిత్ బుమ్రాలో చాలా మార్పు కనిపిస్తోంది. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో రహస్య ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకున్న జస్ప్రిత్ బుమ్రా... ఇప్పుడు భార్యతో కలిసి తన రొమాంటిక్ యాంగిల్ బయటపెడుతున్నాడు. ఫన్నీ వీడియోలు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటున్నాడు.ప్రస్తుతం ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న ‘వైబ్ చెక్’ వీడియోను భార్యతో కలిసి చేశాడు జస్ప్రిత్ బుమ్రా.

View this post on Instagram


A post shared by jasprit bumrah (@jaspritb1)ఇందులో రెండు ఆప్షన్లలో ఒక్కదాన్ని ఎంచుకుని, అటువైపు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్నింట్లో బుమ్రా సెలక్షన్‌కీ, సంజన సెలక్షన్‌కీ తేడాలు ఉండడంతో భార్యను అటువైపు లాక్కెళ్లుతూ కొంటె కోణాన్ని కూడా చూపించాడు ఈ స్టార్ పేసర్... దీంతో చాలామంది నెటిజన్లు పెళ్లికి ముందు చాలా సైలెంట్‌గా ఉండే బుమ్రా, సంజనాతో ముడిపడిన తర్వాత చాలా రొమాంటిక్‌గా మారిపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి : " ఆ దిగ్గజ క్రికెటర్ పై ఉన్న గౌరవం చచ్చిపోయింది " .. క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా, 21 వికెట్లు తీసి ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. గత రెండు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి నెట్‌ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, వచ్చే టీ -20 ప్రపంచకప్ లో బుమ్రా కచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తాడని భారత క్రీడాభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

First published:

Tags: Jasprit Bumrah, Mumbai Indians, Sanjana Ganesan, T20 World Cup 2021, Team India

ఉత్తమ కథలు