Home /News /sports /

TEAM INDIA STAR ALL ROUNDER RAVINDRA JADEJAS HORSE RIDE VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Viral Video : శభాష్ రవీంద్ర జడేజా! సాహసమే శ్వాసగా సాగిపో.. వైరలవుతున్న వీడియో..

Ravindra Jadeja

Ravindra Jadeja

Viral Video : ఇప్పటికే ఇంట్లో కత్తిసాము చేసిన వీడియోలను, తన ఫామ్‌ హౌస్‌లో గుర్రపు స్వారీ చేసిన వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.

    టీమిండియా (Team India) స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కత్తిసాము, కర్రసాముతో పాటు గుర్రపు స్వారీలో ఎంతటి నిష్ణాతుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఈ విద్యలను ప్రదర్శిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. క్రికెట్‌(Cricket News) మ్యాచ్‌ సందర్భంగా ఈ సర్‌కు ఆనందం కలిగితే మైదానంలో బ్యాట్‌తోనే కత్తిసాము చేస్తుండటం ఇదివరకు ఎన్నో సార్లుచూశాం. ఇప్పటికే ఇంట్లో కత్తిసాము చేసిన వీడియోలను, తన ఫామ్‌ హౌస్‌లో గుర్రపు స్వారీ చేసిన వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను జడేజా సోషల్ మీడియా వేదికగా​ షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

    రవీంద్ర జడేజాది రాజుల వంశం అనే విషయం తెలిసిందే. మైదానంలో కూడా మంచి ప్రదర్శన కనబర్చిన సమయంలో జడేజా తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పుతూ.. సంబరాలు జరుపుకుంటాడు. అతన్ని అందరు సర్‌ జడేజా అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఖాళీ సమయంలో దొరకడంతో జడేజా తన సొంత గుర్రంపై స్వారీ చేస్తూ.. వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశాడు.


    ఇన్ని రోజులు బ్యాట్‌, బాల్‌తో అదరగొట్టిన జడేజాను చూసి ఆనందపడిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు జడేజా గుర్రపు స్వారీ చూసి మురిసిపోతున్నారు. తెల్లటి గుర్రంపై జడేజా రాజకుమారుడిలా వస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన సొంత ఫామ్‌లో జడేజా ఇలా గుర్రపు స్వారీ చేస్తు సేదతీరుతున్నాడు. ఇప్పటికే గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు.

    ఇది కూడా చదవండి :  భారీ సెంచరీతో దుమ్మురేపిన తెలుగు కుర్రాడు.. ఇక, ఐపీఎల్ వేలంలో జాక్ పాటే..!

    మరోవైపు, ఈ స్టార్ ఆల్ రౌండర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా గాయాల పాలవుతున్న త్రీడీ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకుబోతున్నట్లు సమాచారం. ఈ స్టార్ ప్లేయర్ త్వరలో టెస్ట్‌ క్రికెట్‌కు త్వరలో గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని జడేజా సహచర ఆటగాడు ఒకరు దైనిక్ జాగరణ్ పత్రికకు తెలిపారు.

    అయితే, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక మోకాలి శస్త్రచికత్స తర్వాత కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మళ్లీ ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాలని జడేజా భావిస్తున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Ravindra Jadeja, Team india, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు