Ravindra Jadeja : సర్ జడేజా.. నీ హార్డ్ వర్క్, డెడికేషన్ కు సలామ్.. వైరల్ వీడియో..

రవీంద్ర జడేదా (Photo Credit : Instagram)

Ravindra Jadeja : రవీంద్ర జడేజా..ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. టీమిండియాలో ఎంతటి కీలక ఆటగాడో అందరికీ తెలుసు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా మూడు రంగాల్లో సత్తా చాటుతూ, అసలైన త్రీడి ప్లేయర్ కు నిర్వచనం చెప్పాడు.

 • Share this:
  దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడింది. ఐపీఎల్ (IPL2021) పై కూడా క్రిమినల్ కరోనా కన్ను పడటంతో బీసీసీఐ(BCCI) నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ టూర్ కు ఎంపికైన టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు ఇళ్లు వదిలి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటూ తమ ఫిట్ నెస్ పై దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న వాటితోనే కసరత్తులు చేస్తున్నారు. ఇక, ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చోటు దక్కించుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌ల్లో రాణించి టీమిండియాకు విజయాలనందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న జడ్డూ.. తన సన్నద్ధత మొదలెట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. గుజరాత్‌ జామ్‌నగర్‌లోని తన నివాసంలో ఉన్న జిమ్‌లోని పరికరాలను మొబైల్‌తో వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. రెండు ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.

  రవీంద్ర జడేజా గత శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా ఉండమని చెబుతూనే తోటి వారికి సహాయం చేయాలని కోరాడు. "దేశ ప్రజలందరూ దయచేసి ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి. దాంతో మీరూ, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి కరోనాతో పోరాడాలి. కాబట్టి దయచేసి మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శానిటైజ్‌ చేసుకోండి. ఏదైనా అవసరమైతే మీ చుట్టు పక్కలున్న వారికి కూడా సహాయం చేయండి" అని జడేజా కోరిన సంగతి తెలిసిందే.  ఇక, ఈ ఐపీఎల్ సీజన్ లో తన విశ్వరూపం చూపించాడు రవీంద్ర జడేజా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు రంగాల్లో తన ఎదురులేదని నిరూపించాడు జడ్డూ. ముఖ్యంగా RCBతో జరిగిన మ్యాచ్ లో సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్ లో జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్‌, రెండు పరుగులు సాధించి మొత్తం (ఒక నోబాల్) 37 పరుగులు పిండుకున్నాడు. ఇక, ఆస్ట్రేలియా సిరీస్ లో గాయపడ్డ తర్వాత..తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజాపై భారీగానే అంచనాలు ఉన్నాయ్. మరోవైపు, జడేజాకి ఇంగ్లండ్ పిచ్ లపై మంచి రికార్డు ఉంది. ఆల్ రౌండర్ గా జడ్డూ సత్తా చాటితే..టీమిండియాకు తిరుగుండదు.
  Published by:Sridhar Reddy
  First published: