Ravindra Jadeja : సాహసమే శ్వాసగా సాగిపో.. వైరలవుతున్న రవీంద్రుడి గుర్రపు స్వారీ వీడియో..

Photo Credit : Instagram

Ravindra Jadeja : బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. మైదానంలో కూడా పాదరసంలా కదులుతూ ప్రపంచస్థాయి ఫీల్డర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగిన జడేజా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తాడు.

  • Share this:
    టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కత్తిసాము గురించి తెలియని వారుండరు. రాజ వంశానికి చెందిన ఈ సౌరాష్ట్ర క్రికెటర్‌ హాఫ్‌ సెంచరీ, సెంచరీ చేసిన సందర్భాల్లో కానీ.. ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ బ్యాట్‌తో కత్తిసాము చేయడం పరిపాటి. అలాంటి జడ్డూ ఇప్పుడు తనలో ఉన్న మరో కళను బయట పెట్టాడు. లేటెస్ట్ గా గుర్రపు స్వారీతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. మైదానంలో కూడా పాదరసంలా కదులుతూ ప్రపంచస్థాయి ఫీల్డర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగిన జడేజా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న జడేజా ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో అనూహ్యంగా గాయపడిన జడేజా ఆసీస్‌తో పాటు ఇంగ్లండ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే తరపున బరిలోకి దిగిన జడ్డూ తన పవరేంటో రుచి చూపించాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్‌సీబీతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఒక్క ఓవర్లోనే ఐదు సిక్సులు. ఒక ఫోర్‌ సహా మొత్తం 37 పరుగులు పిండుకొని చరిత్ర సృష్టించాడు. అంతేగాక సీఎస్‌కే ఆడిన మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు తన మెరుపు ఫీల్డింగ్‌ కనబరిచాడు.

    అయితే లీగ్‌కు కరోనా సెగ తగలడంతో బీసీసీఐ అనూహ్యంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను రద్దు చేసింది. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. లేటెస్ట్ గా జడేజా తనకు ఇష్టమైన గుర్రపు స్వారీతో సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన జడ్డూ.. '' నా రైడింగ్‌ స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకుంటున్నా'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం జడేజా వీడియో తెగ వైరలవుతోంది.



    ఇక జడేజా త్వరలో జరగబోయే ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజా చోటు సంపాదించాడు. టెస్టు చాంపియన్‌షిప్‌ అనంతరం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లోనూ జడేజా ఆడనున్నాడు. ఇక టీమిండియా జట్టు జూన్‌ 2న ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరనుంది. ఈ సిరీస్ కోసం ఇంట్లోనే ప్రత్యేకంగా జిమ్ లో గడుపుతున్నాడు. ప్రత్యేకంగా కఠోర సాధన చేస్తూ.. సిరీస్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద మంచి రికార్డు ఉన్న జడేజా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.
    Published by:Sridhar Reddy
    First published: