Team India: టీమ్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ.. గాయంతో ఆసుపత్రిలో చేరిన స్టార్ ప్లేయర్.. నాలుగో టెస్టుకు డౌటే

గాయంలో ఆసుపత్రిలో చేరిన టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ (PC: BCCI)

Team India: ఓటమి బాధలో ఉన్న టీమ్ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో ఆసుపత్రిలో చేరాడు. అతడు నాలుగో టెస్టులకు అందుబాటులో ఉండేది అనుమానమే.

  • Share this:
    లీడ్స్‌లోని హెడింగ్లేలో జరిగిన 3వ టెస్టులో (3rd Test) ఇంగ్లాండ్ (England) చేతితో భారత జట్టు (Team India)ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి బాధతో ఉన్న కోహ్లీ (Virat Kohli) సేనకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గాయంతో ఆసుపత్రిలో చేరాడు. అతడు నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ రవీంద్ర జడేజా గాయపడ్డాడు. మోకాలికి గాయం అయినా అలాగే బ్యాటింగ్ చేశాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ ముగిసిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్లు టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పింది. ఆసుపత్రిలో రవీంద్ర జడేజా మోకాలికి స్కానింగ్ చేశారు. కాగా, ఇంకా దానికి సంబంధించిన రిపోర్టులు రావలి ఉన్నది. ఆసుపత్రిలో చేరిన విషయాన్ని రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చాడు. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న జడేజా.. ఇది అంత సురక్షితమైన ప్రాంతం కాదు అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీంతో అభిమానులు అతడికి ఏమైందని ఆరా తీశారు. కాగా, మోకాలి గాయంతో అతను ఆసుపత్రిలో చేరిన విషయం తర్వాత తెలిసింది. మూడో టెస్టులో 32 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజా రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

    రవీంద్ర జడేజా గతంలో కూడా మోకాలి గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటన ముందుగానే గాయపడటంతో అతడు చాలా రోజులు జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. అంతే కాకుండా ఐపీఎల్ 2021 తొలి దశలో సీఎస్కే తరపున బరిలోకి దిగాడు. అప్పటి నుంచి వరుసగా క్రికెట్ ఆడుతున్న జడేజాకు.. పాత గాయమే మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తున్నది.






    ఇక మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకున్నది. భారత జట్టు శనివారం తొలి సెషన్‌లోనే 8 వికెట్లు కోల్పోయింది. ఓలీ రాబిన్ సన్ 5 వికెట్లు, ఓవర్టన్ 3 వికెట్లు తీసి సత్తా చాటారు. ఓలీ రాబిన్‌సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు లండన్‌లొని ది ఓవల్ మైదానంలో జరుగనున్నది.

    National Sports Day: భారత క్రీడా చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు ఇవే

    Published by:John Naveen Kora
    First published: