Home /News /sports /

TEAM INDIA SKIPPER VIRAT KOHLI WIFE ANUSHKA SHARMA MAKES HEAD LINES AFTER THIS BCCI TWEET SRD

Anushka Sharma : హాఫ్ సెంచరీ, ఐదు వికెట్లతో దుమ్మురేపిన అనుష్క శర్మ.. కోహ్లీపై బీసీసీఐ సెటైర్..!

Virat Kohli (PC : Twitter)

Virat Kohli (PC : Twitter)

Anushka Sharma : తొలుత బ్యాటింగ్ లో 72 పరుగులు చేసిన అనుష్క శర్మ.. తర్వాత బంతితోనూ విజృంభించింది. ఐదు వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచింది. అంతే కాదండోయ్.. ఫీల్డింగ్ లో పాదరసంగా కదులుతూ ఇద్దరు బ్యాటర్లను రనౌట్ చేసి తన జట్టును గెలిపించింది.

ఇంకా చదవండి ...
  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ (Anushka Sharma) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు కారణం బీసీసీఐ ట్వీటే. ఆ ట్వీట్ సారాంశం ప్రకారం అనుష్క శర్మ (Anushka Sharma) ఇరగదీసింది. తొలుత బ్యాటింగ్ లో 72 పరుగులు చేసిన ఆమె.. తర్వాత బంతితోనూ విజృంభించింది. ఐదు వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచింది. అంతే కాదండోయ్.. ఫీల్డింగ్ లో పాదరసంగా కదులుతూ ఇద్దరు బ్యాటర్లను రనౌట్ చేసి తన జట్టును గెలిపించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనుష్క శర్మ ఆటకు ఇప్పుడు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భవిష్యత్తులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డులకు చెక్ పెట్టనుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ చూసిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడుతున్నారు. అనుష్క శర్మ ఏంటి హాఫ్ సెంచరీ, ఐదు వికెట్లు తీయడం ఏంటి అని ఫ్యాన్స్ లో ప్రశ్నలు మొదలయ్యాయ్. సినిమాలోనా లేదా నిజంగానా అంటూ సోషల్ మీడియా యూసర్ల మెదడులో ప్రశ్నల మీద ప్రశ్నలు మెదులుతున్నాయి. బీసీసీఐ ఈ ట్వీట్‌ చేసినప్పటి నుంచి యావత్‌ క్రికెట్‌ ప్రియుల పరిస్థితి ఇలానే మారింది.

  అయితే బీసీసీఐ పేర్కొన్న అనుష్క శర్మ.. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సతీమణి మాత్రం కాదు. హాఫ్ సెంచరీ బాదింది, ఐదు వికెట్లు పడగొట్టింది మరెవరో కాదు.. భారత మహిళల అండర్‌ 19 క్రికెటర్‌. మహిళల అండర్‌ 19 వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ 2021-22 టోర్నమెంట్‌ మంగళవారం ఆరంభం అయింది. ఇందులో దేశవాళీ మహిళా క్రికెటర్లను టీమ్‌ ఏ, బీ, సీ, డీలుగా నాలుగు జట్లుగా విభజించారు. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్‌ రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది.
  వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీలో 'టీమ్‌ బి' జట్టు కెప్టెన్‌ పేరు అనుష్క బ్రిజ్‌ మోహన్‌ శర్మ. మంగళవారం టోర్నీలో తొలి మ్యాచ్‌ జరగ్గా.. బీసీసీఐ విమెన్‌ (BCCI Women) తమ ట్విటర్‌ ఖాతాలో ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. అందులో 'అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులు' అని రాసి ఉంది. దీంతో ఈ ట్వీట్ కాస్తా నెటిజన్లను ఆశ్చర్యానికి, అంతకుమించి గందరగోళానికి గురిచేసింది. అనుష్క పేరు చూడగానే విరాట్ కోహ్లీ సతీమణి అనే అంతా అనుకున్నారు. అంతేకాదు కోహ్లీని విమర్శించేందుకు బీసీసీఐ ఇలా ట్వీట్ చేసిందేమో అని ఫీల్ అయ్యారు.
  ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు కోహ్లీని ఉద్దేశిస్తూ ఫన్నీ పోస్టులు, మీమ్స్‌ పెడుతున్నారు. 'అనుష్క శర్మ క్రికెట్ మ్యాచ్ ఆడిందా'?, 'అనుష్క హాఫ్ సెంచరీ చేసిందా?', 'కోహ్లీఫై బీసీసీఐ సెటైర్ వేసింది' అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
  టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా జరిగిన తొలి మ్యాచులో పాకిస్తాన్, న్యూజీలాండ్ చేతిలో కోహ్లీసేన ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా రెండు వరుస పరాభవాలు ఎదుర్కొంది. బ్యాటర్లు, బౌలర్లు తేలిపోవడంతో భారత జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా నీచాతిమైన ట్రోలింగ్ కు దిగుతున్నారు. కివీస్ చేతిలో ఓడిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. కోహ్లీతో పాటు అతడి భార్య అనుష్క శర్మ, 9 నెలల కుమార్తె వామికపై కూడా అసభ్యకర కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్ ను చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఖండించారు. అలాంటి వాళ్లకు మెదుడ్లు ఉండవని కౌంటర్ ఇచ్చారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Anushka Sharma, Bcci, Cricket, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు