• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • TEAM INDIA SKIPPER VIRAT KOHLI TROLLED BY NETIZENS DUE TO THIS REASON SRD

Virat Kohli : కోహ్లీ నీకు బుద్ధుందా.. ఆ ఘటనను మర్చిపోయావా..ఆ పని చేయడానికి నీకు సిగ్గులేదా..

Virat Kohli : కోహ్లీ నీకు బుద్ధుందా.. ఆ ఘటనను మర్చిపోయావా..ఆ పని చేయడానికి నీకు సిగ్గులేదా..

విరాట్ కోహ్లీ

Virat Kohli : ఐపీఎల్ కు ముందు కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు. ఇంతకీ కోహ్లీ చేసిన తప్పేంటి. వారి కోపానికి కారణమేంటి..?

  • Share this:
    ఇంకా రెండు గంటల్లో క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ కు రంగం సిద్ధమైంది. ఫస్ట్ ఫైట్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore). రెండు జట్లు భీకరంగా ఉన్నాయ్. ఎవరు గెలిచినా.. ఆఖరి విజయం ఫ్యాన్స్ దే. అయితే ఈ సారి ఈ మెగాలీగ్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్‌గా చైనా మొబైల్ కంపెనీ వివోనే వ్యవహరిస్తుంది. వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం వివో బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. టైటిల్ స్పాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. అయితే గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయ్. దీంతో గతేడాది సీజన్ కు డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. ఇందుకోసం బీసీసీఐకి రూ.222 కోట్లు చెల్లించింది డ్రీమ్ 11.ఇరుదేశాల మధ్య ఇప్పటికీ అవే పరిస్థితులు ఉండడం‌తో ఈ సీజన్ మొదట్లో వివోతో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంటుందనే ప్రచారం జరిగింది. కానీ జనాలు గల్వాన్ ఘటన మరిచిపోవడం, అప్పటిలా పెద్దగా విమర్శలు రాకపోవడంతో బీసీసీఐ ఒప్పందం ప్రకారం వివోతోనే ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ఇటీవలే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ కంపెనీకి ప్రచారకర్తగా నియమితుడయ్యాడు.

    ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఉన్న క్రేజ్‌ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందని వివో వెల్లడించింది. టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివో సంస్థ పేర్కొంది. విరాట్ కోహ్లీ తన కాంట్రాక్ట్‌లో భాగంగా.. సంస్థకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడని కంపెనీ వివరించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా విరాట్‌పై ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






    చైనా కంపెనీ అయిన వివోకు ప్రచారకర్తగా ఉండేందుకు సిగ్గుందా? అని కోహ్లీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "గల్వాన్ ఘటన సమయంలో దేశభక్తి చాటిన నువ్వు.. ఏడాది తిరగకముందే జవాన్ల మరణాలు మరిచిపోయావా? " అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో కోహ్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి మరి ప్రశ్నిస్తున్నారు. ఇంత మాత్రానికి గతేడాది ఎందుకు నిషేధించారని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ జనాలు కూడా ఏ విషయాన్ని ఎక్కువ రోజు గుర్తుంచుకోరని కామెంట్ చేస్తున్నారు. అదే ధోనీ.. వివోకి బ్రాండ్ అంబాసిడర్ అనగానే తిట్టినా కొందరు ..ఇప్పుడు కోహ్లీని వెనకేసుకువస్తున్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు