TEAM INDIA SKIPPER VIRAT KOHLI MAY FACE ONE MATCH SUSPENSION OVER HEATED ARGUMENT WITH UMPIRE IN SECOND TEST SRD
Virat Kohli : టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం తప్పదా...కారణం అదేనా...
Virat Kohli (Photo Credit : Twitter)
Virat Kohli : అహ్మదాబాద్ పింక్ టెస్ట్ కు టీమిండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ బ్యాన్ పడే అవకాశం ఉంది. అందుకు కోహ్లీ ప్రవర్తనే కారణం.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ బ్యాన్ పడే అవకాశం ఉంది. అందుకు కోహ్లీ ప్రవర్తనే కారణం. ఐసీసీ రూల్స్ కు వ్యతిరేకంగా అంపైర్ తో వాగ్వాదానికి దిగిన కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.అసలు విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అక్షర్ పటేల్ వేసిన బంతిని రూట్ ఆడగా కీపర్ పంత్ చేతుల్లో పడింది. అయితే రూట్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిందనుకొని టీమిండియా అంపైర్‌కు క్యాచ్ అప్పీల్ చేసింది. కానీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వారి అప్పీల్‌ను పరిగణలోకి తీసుకోకుండా నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా డీఆర్ఎస్కు వెళ్లింది. అయితే రిప్లేలో బంతి జో రూట్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించినా.. బ్యాట్‌కు ఎక్కడా ఎడ్జ్ అవలేదని తేలింది. దీంతో ఎల్బీకి ఏమైనా చాన్స్ ఉందేమోనని థర్డ్ అంపైర్ మరోసారి పరిశీలించారు. రిప్లేలో అక్షర్ వేసిన బంతి రూట్ ప్యాడ్లను తాకుతూ ఆప్‌స్టంప్ లైన్ మీదుగా వెళ్లినట్లు కనిపించింది. కానీ రివ్యూలో రూట్ నాటౌట్ అని ప్రకటించడంతో కోహ్లికి కోపం చిర్రెత్తికొచ్చింది. దీంతో అంపైర్ నితిన్ మీనన్ వద్దకు వచ్చి చాలా సేపు వాదించాడు. టీమిండియా ఆటగాళ్లు ఎవరి స్థానాల్లో వారు వెళ్లిపోయేంతవరకు కోహ్లి అంపైర్‌తో మాట్లాడుతున్నట్లు కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి రవిశాస్త్రి కూడా ఔటేనన్నట్లు సైగలు చేశాడు.
అయితే ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ 2.8 ప్రకారం మైదానంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగినా.. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా తప్పిదమే. దాంతో ఈ నిబంధన కింద విరాట్ కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశంఉంది. నాలుగు డీ-మెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంది. కోహ్లీ పేరు మీద ఇప్పటికే రెండు డీ-మెరిట్ పాయింట్లు ఉన్నాయి.నిబంధనల ప్రకారం 24 నెలల్లో ఈ డీ-మెరిట్ పాయింట్లు నాలుగుకు చేరితే సదరు క్రికెటర్ ఒక టెస్టు లేదా రెండు వన్డే, టీ20లకు సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇక సెకండ్ టెస్ట్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే.
Virat Kohli wasn't too happy with the umpire there.
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రూట్ అవుట్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్‌పై దురుసుగా ప్రవర్తించనందుకు కోహ్లిని మిగిలిన టెస్టుల నుంచి బ్యాన్ చేయాలంటూ పేర్కొన్నాడు.ఈ విషయంపై డేవిడ్ లాయిడ్ స్పందిస్తూ.. "ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ కోహ్లి ఇలా ప్రవర్తించడం దారుణం. ఫీల్డ్ అంపైర్‌పైకి కోపంతో అలా దూసుకెళ్లడం కరెక్ట్ కాదు. జెంటిల్మెన్ గేమ్ అని పిలుచుకునే క్రికెట్లో కోహ్లి చర్యల వల్ల ఇక్కడ కూడా రెడ్, యెల్లో కార్డులు జారీ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే అంపైర్‌పై కోహ్లి కోపం వ్యక్తం చేసినందుకు గానూ రెడ్ కార్డ్ చూపించి మూడు టెస్టులు బ్యాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్రికెట్ కాకుండా మరే ఆటైనా కోహ్లి తన ప్రవర్తనతో ఆన్‌ఫీల్డ్ వీడి బయటకు వెళ్లాల్సి వచ్చేది."అంటూ పేర్కొన్నాడు. లాయిడ్ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు టీమిండియా మాజీ బౌలర్.. కామెంటేటర్ జగవల్ శ్రీనాథ్ పక్కనే ఉండడం విశేషం.