విరాట్ సేనకు నో రెస్ట్ ..మళ్లీ ఆస్ట్రేలియాతో టీ20,వన్డే సిరీస్‌లు ఫిక్స్

రాబోయె ఏడు నెలల్లో విరామం లేకుండా విరాట్ సేన సిరీస్‌లు ఆడనుంది. 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసిసిఐ ) గ్యాప్ లేకుండా టీమిండియా షెడ్యూల్ ఫిక్స్ చేసింది.

news18-telugu
Updated: January 10, 2019, 2:27 PM IST
విరాట్ సేనకు నో రెస్ట్ ..మళ్లీ ఆస్ట్రేలియాతో టీ20,వన్డే సిరీస్‌లు ఫిక్స్
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ (BCCI/Twitter)
news18-telugu
Updated: January 10, 2019, 2:27 PM IST
విరాట్ కొహ్లీ నాయకత్వంలోని ఇండియన్ టీమ్‌కు ఇప్పట్లో గ్యాప్ దొరికేలా లేదు. ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్...న్యూజిలాండ్‌లో వన్డే,టీ20 సిరీస్‌లు ఎప్పుడో ఫిక్స్ అవ్వగా... సొంతగడ్డపై మరో క్లిష్టమైన రెండు సిరీస్‌లు ఆడనుంది. న్యూజిలాండ్ టూర్ ముగించుకుని టీమిండియా స్వదేశం చేరిన తర్వాత ఆస్ట్రేలియా‌తో వన్డే,టీ20 సిరీస్‌లు ఖరారయ్యాయి. ఆరోన్ ఫించ్ సారధ్యంలోని ఆసీస్ టీమ్ భారత్‌‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కంగారూ టీమ్ రెండు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లతో పాటు ఐదు వన్డే మ్యాచ్‌లు  ఆడనుంది. రాబోయె ఏడు నెలల్లో విరామం లేకుండా విరాట్ సేన సిరీస్‌లు ఆడనుంది. 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసిసిఐ ) గ్యాప్ లేకుండా టోర్నమెంట్స్ ఖరారు చేసింది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్:
జనవరి 12 నుంచి 18 వరకూ ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్

న్యూజిలాండ్ టూర్:
జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3 వరకూ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. సరిగ్గా మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి 6 నుంచి 10 వరకూ 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్ జరుగుతుంది.

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన
న్యూజిలాండ్ టూర్ ముగిసిన 11 రోజుల తర్వాత నుంచి ఆస్ట్రేలియాతో వెంటవెంట సిరీస్‌లు ఆడనుంది. భారత్‌-ఆస్ట్రేలియా ఫిబ్రవరి 24 నుంచి 27 వరకూ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌...మార్చి 2 నుంచి 13 వరకూ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌ల్లో పోటీపడతాయి.

ఐపీఎల్ 12వ సీజన్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన 10 రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభమవుతుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 12వ సీజన్ పోటీలు స్టార్ట్ అవుతాయి. ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లందరూ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతారు.

2019 వన్డే వరల్డ్‌కప్
మే 30 నుంచి ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్ పోటీలు ఆరంభమవుతాయి. ఈ సుదీర్ఘ టోర్నీలో భారత జట్టు 9 జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. 14 జులై వరకూ వరల్డ్‌కప్ పోటీలు జరుగుతాయి.
First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...