Home /News /sports /

TEAM INDIA SENIOR SPINNER RAVICHANDRAN ASHWIN GIVES STRONG REPLY TO MEDIA AS THERE WERE REPORTS HE COMPLAINED AGAINST KOHLI TO BCCI SRD

Ravichandran Ashwin : విరాట్ కోహ్లీతో గొడవలు.. రవిచంద్రన్ అశ్విన్ రియాక్షన్ అదుర్స్..!

Virat Kohli - Ashwin

Virat Kohli - Ashwin

Ravichandran Ashwin : లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ - రవిచంద్రన్ అశ్విన్ లపై అనేక ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయ్. ఈ వార్తల నేపథ్యంలోనే ఓ సీనియర్ ఆటగాడు.. కోహ్లీ ప్రవర్తన బాలేదని బీసీసీఐ (BCCI) సెక్రటరీ జైషాకు ఫిర్యాదు చేశాడని 'ది టెలిగ్రాఫ్' ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇంకా చదవండి ...
    లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ (Virat Kohli Latest Telugu News) - రవిచంద్రన్ అశ్విన్ లపై అనేక ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయ్. ఈ వార్తల నేపథ్యంలోనే ఓ సీనియర్ ఆటగాడు.. కోహ్లీ ప్రవర్తన బాలేదని బీసీసీఐ (BCCI) సెక్రటరీ జైషాకు ఫిర్యాదు చేశాడని 'ది టెలిగ్రాఫ్' ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్వినే(Ravichandran Ashwin)నని ఓ ప్రముఖ వార్తా సంస్థ స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్బంగా కోహ్లీ- అశ్విన్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా సీమింగ్ కండిషన్స్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం జట్టుకు చేటు చేసింది. ఈ ఫ్రస్టేషన్ అంతా కోహ్లీ అశ్విన్‌పై చూపించాడని, అతని ప్రవర్తన పట్ల అశ్విన్ విసుగు చెందాడని ఆ కథనంలో తెలిపింది. అప్పటి నుంచి అశ్విన్, కోహ్లీ మధ్య విభేదాలు ఏర్పాడ్డాయని, డ్రెస్సింగ్ రూమ్ కూడా రెండుగా చీలిపోయిందని రాసుకొచ్చారు. ఆ కారణంగానే ఇంగ్లండ్ పర్యటనలో అశ్విన్‌ను కోహ్లీ దూరం పెట్టాడని, కోహ్లీ ప్రవర్తనతో విసుగుచెందిన అశ్విన్ బీసీసీఐ ఫిర్యాదు చేశాడని పేర్కొంది. అయితే, ఈ వార్తలపై రవి టీమిండియా స్టార్ స్పిన్నర్, ఢిల్లీ కేపిటల్స్ బౌలింగ్ తురుఫుముక్క రవిచంద్రన్ అశ్విన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

    కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ముగ్గురు సీనియర్ ప్లేయర్లు.. అతనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌కు కంప్లయింట్ ఇచ్చారంటూ ఒకట్రెండు రోజులుగా మీడియాలో వరుసగా కథనాలు వెలువడుతోన్నాయి. దీనికంతటికీ మూలకారకుడు రవి చంద్రన్ అశ్వినే అనేది మీడియాలో వస్తోన్న కథనాల సారాంశం.

    విశ్వసించదగ్గ న్యూస్ ఏజెన్సీ కావడం వల్ల దాన్ని అన్ని స్పోర్ట్స్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి. ఈ మీడియాలో వెలువడిన ఈ కథనాల పట్ల రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేశాడు. మరో క్రికెటర్ లేదా సెలెబ్రిటీ అయి ఉంటే ఓ రిజాయిండర్ ఇచ్చేవాళ్లు. అక్కడున్నది రవిచంద్రన్ అశ్విన్. అందుకే- తనదైన స్టైల్‌లో కౌంటర్ అటాక్‌కు దిగాడు. ఆ న్యూస్ ఏజెన్సీని ట్రోల్ చేశాడు. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.



    మొత్తానికి తమ మధ్య గొడవలు లేవంటూ రవిచంద్రన్ అశ్విన్ క్లారీటీ ఇచ్చాడు. బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ పై ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ తెలిపింది. కెప్టెన్సీ నుంచి దిగమని మేం ఒత్తిడి చేయలేదంటూ తెలిపింది. అయినా, టీమిండియాలో ఏదో నడుస్తోందన్న టాక్ విన్పిస్తోంది. రెండు గ్రూప్ లుగా టీమిండియా విడిపోయిందన్న వార్తలు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయ్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Ravichandran Ashwin, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు