Home /News /sports /

TEAM INDIA SCORED 211 RUNS AGAINST SOUTH AFRICA IN FIRST T20 MATCH AK

Ind Vs SA: కమ్మేసిన కుర్రాళ్లు.. సఫారీ జట్టు ముందు భారీ టార్గెట్ ఎంతంటే..

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా

Ind Vs SA: టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా జట్టు.. 20 ఓవర్లు ముగిసే సరికి 211 పరుగుల భారీ లక్ష్యాన్ని సఫారీ జట్టు ముందు ఉంచింది.

    దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టి20 మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా(Team India) జట్టు.. 20 ఓవర్లు ముగిసే సరికి 211 పరుగుల భారీ లక్ష్యాన్ని సఫారీ(South Africa) జట్టు ముందు ఉంచింది. టీమిండియా ఓపెనర్లు ఇషా కిషన్(Ishan Kishan), రుతరాజ్ గైక్వాడ్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర గైక్వాడ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో(Shreyas Iyyar) ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. రెండో వికెట్‌కు మరో 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 137 పరుగుల దగ్గర ఇషాన్ కిషన్ వెనుదిరిగాడు. మొత్తం 48 బంతులు ఆడిన ఇషాన్ కిషన్.. మూడు సిక్స్‌లు, 11 ఫోర్లతో మొత్తం 76 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు.

    ఇషాన్ ఔటైన తరువాత శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా త్వరగానే పడిపోయింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ చేరాడు శ్రేయాస్. ఆ తరువాత క్రేజ్‌లోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ హార్ధిక్ పాండ్యాతో కలిసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరు 200 పరుగులు దాటించారు. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో పంత్ 29 పరుగుల దగ్గర ఔటయ్యాడు.



    చివర్లో బ్యాటింగ్‌లో హార్థిక్ మెరుపులు మెరిపించాడు 12 బాల్స్‌లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, అన్‌రిచ్ నార్ట్జ్ పార్నెల్, ప్రిటోరియస్ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర తెంబా బావుమా ఔటయ్యాడు.

    IND vs SA First T20I : టాస్ నెగ్గిన సౌతాఫ్రికా.. ఉమ్రాన్, అర్షదీప్ లకు తప్పని నిరాశ..

    Virushka: ఇంగ్లండ్ టూర్ కు ముందు ప్రియసఖితో విలువైన సమయం గడుపుతున్న కోహ్లీ..

    ఈ మ్యాచ్ గెలిచి ఐదు టి20 మ్యాచ్‌ల సిరిస్‌లో శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోసారి తొలి మ్యాచ్‌లో గెలిచి ఆతిధ్య జట్టుపై పైచేయి సాధించాలని సపారీ జట్టు సైతం అంతే పట్టుదలగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హోరాహోరీగానే సాగే అవకాశం ఉందని క్రికెట్ లవర్స్ భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: India vs South Africa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు