పొట్టి ప్రపంచ కప్‌లో భారత జట్టు (Team India) సూపర్ 12లోనే (Super 12) వెనుదిరిగింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. అంచనాల మేరకు రాణించలేకపోవడంతో భారత జట్టుకు పరాభవం తప్పలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ (t20 World Cup) ముగిసి పది రోజులు తిరక్కుండానే భారత జట్టు పూర్తిగా పుంజుకున్నది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అసమాన ప్రతిభ చూపించిన యువ క్రికెటర్లు భారత జట్టుకు సిరీస్‌లో క్లీన్ స్వీప్ విజయాన్ని అందించారు. న్యూజీలాండ్ జట్టుపై (New Zealand) టీమ్ ఇండియా 3-0తో విజయం సాధించింది. భారత జట్టు 3వ టీ20ని గెలవడంతో కివీస్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుసగా 8వ విజయం. అంతకు ముందు 2020లో న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు 5-0తో అన్ని టీ20 మ్యాచ్‌లను గెలిచింది. తాజాగా మరో మూడు మ్యాచ్‌లు వరుసగా గెలిచింది. ఇక భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో మరిన్ని రికార్డులు సృష్టించింది.
3వ టీ20లో భారత జట్టు 73 పరుగులతో విజయం సాధించింది. భారీ తేడాతో న్యూజీలాండ్‌పై జట్టు ఓడిపోవడం ఇది నాలుగో సారి. అంతకు ముందు 2010లో పాకిస్తాన్‌తో క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టు 103 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇక 2017లో ఆంక్లాండ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో, 2019లే నేపియర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగులు తేడాతో ఓడిపోయింది. న్యూజీలాండ్ జట్టు అన్ని ఫార్మాట్లలో బలంగా కనిపిస్తున్నది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా వచ్చింది. కానీ టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఘోర పరాజయాలను మూట గట్టుకున్నది.
ఇక టీమ్ ఇండియా 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు కలిగిన టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లు వైట్ వాష్ చేయడం ఇది ఆరోసారి. భారత జట్టు ఇప్పటి వరకు 6 సార్లు వైట్ వాష్ చేయగా.. పాకిస్తాన్ కూడా 6 సార్లు ఇదే ఫీట్ సాధించింది. ఈ రెండు జట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు 5 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, దక్షిణాప్రికా 3 సార్లు వైట్ వాష్ చేసి తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఇండియా టీ20 మ్యాచ్‌లను వైట్ వాష్ చేసిన సిరీస్‌లు ఇవి.
- ఆస్ట్రేలియాపై 2016లో 3-0 తేడాతో (ఆస్ట్రేలియాలో)
- శ్రీలంకపై 2017లో 3-0 తేడాతో (ఇండియాలో)
- వెస్టిండీస్‌పై 2018లో 3-0 తేడాతో (ఇండియాలో)
- వెస్టిండీస్‌పై 2019లో 3-0 తేడాతో (వెస్టిండీస్‌లో)
- న్యూజీలాండ్‌పై 2020లో 5-0 తేడాతో (న్యూజీలాండ్‌లో)
- న్యూజీలాండ్‌పై 2021లో 3-0 తేడాతో (ఇండియాలో)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ICC, India vs newzealand, Team India