సారా టెండుల్కర్‌కి షబ్‌మాన్ గిల్ "హార్ట్" మెసేజ్... హార్ధిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసా...

Sara Tendulkar : ఓవైపు వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంటే... టీంఇండియా కుర్ర ప్లేయర్లు మాత్రం ప్రేమ కబుర్లలో మునిగితేలుతున్నారు. అందుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.

Krishna Kumar N | news18-telugu
Updated: June 16, 2019, 11:16 AM IST
సారా టెండుల్కర్‌కి షబ్‌మాన్ గిల్
షబ్‌మాన్ గిల్, సారా టెండుల్కర్, హార్దిక్ పటేల్ (Image : Instagram)
  • Share this:
తన టీమ్ మేట్స్‌ని ఆటాడుకోవడంలో ప్లేయర్ హార్ధిక్ పాండ్యా ఏమాత్రం వెనక్కి తగ్గడు. తాజాగా తను కుర్ర ప్లేయర్ షబ్‌మాన్ గిల్‌ని టార్గెట్ చేశాడు. ఈ గేమ్ ఇన్‌స్టాగ్రాంలో మొదలైంది. ముందుగా షబ్‌మాన్... తను కొత్తగా కొనుక్కున్న రేంజ్ రోవర్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఈ పంజాబీ ఆటగాడు... ఈమధ్యే జరిగిన IPL 2019లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌కి తోడు... హుందా అయిన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌లు ఆడి, 296 రన్స్ చేసిన గిల్... టాప్ స్కోర్‌గా 76 తెచ్చుకున్నాడు. బ్యాట్‌తో రఫ్పాడించిన గిల్... ఆ టోర్నమెంట్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌ అవార్డ్ దక్కించుకున్నాడు. టోర్నీ ముగిశాక... తనను తానే మెచ్చుకుంటూ... తనకు తానే రేంజ్ రోవర్‌ను గిఫ్టుగా ఇచ్చుకున్నాడు. దాని పక్కన నిల్చొని... తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.
View this post on Instagram

Thalle mere Range akh baaz naalo tezz! Caption credits- @jassie.gill 😉


A post shared by Ꮪhubman Gill (@shubmangill) on

యంగ్ స్టార్‌ను మెచ్చుకుంటూ... మెసేజ్‌లు రన్స్‌లా వస్తూ... ఇన్‌స్టాగ్రాం బోర్డును పరుగులు పెట్టించాయి. ఆ మెసేజ్‌లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ పంపిన మెసేజ్ ప్రత్యేకంగా నిలిచింది. ఆమె కంగ్రాట్స్ చెప్పడంతో... వెంటనే స్పందించిన గిల్... ఆమెకు థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా... చివర్లో హార్డ్ సైన్‌ కూడా పంపాడు. అదికాస్తా వైరల్ అయ్యింది. వాళ్ల మధ్య ఏం జరుగుతోందంటూ ఫ్యాన్స్ ఒకటే గుసగుసలు.

sara tendulkar,sara tendulkar interview,sachin tendulkar,sachin tendulkar daughter sara boyfriend,sara tendulkar song,sara tendulkar singing,arjun tendulkar bowling,sara tendulkar daiting,sara tendulkar movie,sara tendulkar dance,sara tendulkar hot dance,arjun tendulkar,sara tendulkar hot,sara tendulkar in love,sara tendulkar bollywood,sara tendulkar speaking in marathi,sara tendulkar weds anant ambani,షబ్ మాన్ గిల్, హార్ధిక్ పాండ్యా, సారా టెండుల్కర్, ఇన్‌స్టాగ్రామ్,
షబ్‌మాన్ గిల్, సారా టెండుల్కర్, హార్దిక్ పాండ్య మధ్య చాటింగ్


వాటికి మరింత బూస్ట్ ఇస్తూ... ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా టీజ్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. సారా తరపున తాను వెల్‌కం చెబుతున్నానని అన్నాడు. దాంతో... ఈ చాటింగ్ సోషల్ నెట్‌వర్క్‌ సైట్లలో తెగ షేరింగ్ అవుతోంది.ఇవి కూడా చదవండి :

4 నెలల కిందట పెళ్లి... అంతలోనే ఆత్మహత్య... సంతోష్, అర్చన విషయంలో ఏమైంది...

జమ్మూకాశ్మీర్‌లో హైఅలర్ట్... ఉగ్రదాడులు జరగొచ్చన్న పాకిస్థాన్...


Miss India 2019 : ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచిన సుమన్ రావు
Published by: Krishna Kumar N
First published: June 16, 2019, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading