ఆస్ట్రేలియా సిరీస్ మనదే.. గెలుపును జవాన్లకు అంకితమిస్తామన్న షమీ

పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడికి దేశమంతా అట్టుడుకుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యజనం వరకు అందరూ జవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక, ఈ విషయంలో టీమిండియా క్రికెటర్లు ఒకడుగు ముందే ఉన్నారు.

news18-telugu
Updated: February 19, 2019, 9:51 PM IST
ఆస్ట్రేలియా సిరీస్ మనదే.. గెలుపును జవాన్లకు అంకితమిస్తామన్న షమీ
మహ్మద్ షమీ ( BCCI / Twitter )
  • Share this:
పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారతావని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచింది. కేంద్రప్రభుత్వం, పలు రాష్ట్రప్రభుత్వాలతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. అమరజవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలవడంలో, మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంలో టీమిండియా క్రికెటర్లు మాత్రం ఒకడుగు ముందే ఉన్నారని చెప్పవచ్చు. సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, హర్బజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు తమవంతు సాయాన్ని ప్రకటించారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ సైతం అమరుల కుటుంబాలకు రూ. 5లక్షల ఆర్థికసాయం ప్రకటించాడు. ఇప్పుడీ ఇండియన్ పేసర్.. కొత్త టార్గెట్‌ను నిర్దేశించుకున్నాడు. త్వరలో భారత్ ఆడబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలిచి తీరుతామని తాజాగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఆ విజయాన్ని అమరులకు అంకితం చేస్తామని చెప్పాడు. తాము దేశం కోసం క్రికెట్ ఆడుతుంటే, దేశసరిహద్దుల్లో రక్షణగా ఉండేది సైనికులేనన్నాడు. వారు మనకోసం చేస్తున్న త్యాగానికి బదులుగా రుణం తీర్చుకునే బాధ్యత భారతీయులందరిపైనా ఉందని షమీ అన్నాడు. ఇండియన్స్ అందరూ సురక్షితంగా ఉంటున్నారంటే, 24 గంటల పాటు జవాన్లు సరిహద్దుల్లో కాపలా కాయడం వల్లేనని చెప్పాడు. అందుకే వాళ్లకోసం త్వరలో ఆడబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలిచి తీరుతామని చెప్పాడు. ఆ విజయాన్ని అమరజవాన్లకు అంకితం ఇస్తామని చెప్పాడు.

టీమిండియా ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఐదు మ్యాచ్‌ల వన్డేసిరీస్‌లను ఆడనుంది. ఈ సిరీస్‌ను గెలిచే సత్తా టీమిండియాకు ఉందని, ఆ విజయాన్ని అమరులకు అంకిత చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు షమీ. మరోవైపు, టీమిండియా ఓపెన్ శిఖర్ ధావన్ కూడా అమరుల కుటుంబాలకు తమవంతు సాయం చేస్తానని ప్రకటించాడు. భారతీయులందరూ అమర జవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలవాలని ట్విట్టర్ వేదికగా కోరాడు.
First published: February 19, 2019, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading