Home /News /sports /

TEAM INDIA PACER DEEPAK CHAHAR SHARES A VIDEO ON INSTAGRAM WHERE HE DANCE WITH HIS WIFE JAYA BHARADWAJ SJN

Viral Dance : భార్యతో కలిసి తీన్మార్ ఆడిన టీమిండియా కొత్త పెళ్లికొడుకు.. సూపరో.. సూపర్.. అంటున్న ఫ్యాన్స్

(PC : INSTAGRAM)

(PC : INSTAGRAM)

Viral Dance : టీమిండియా (Team India) స్టార్ పేసర్ దీపక్ చహర్ (Deepak Chahar) ఈ నెల 1వ తేదీన ప్రేయసి జయ భరద్వాజ్ ఆగ్రాలో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్లేయర్లు హాజరయ్యారు కూడా.

ఇంకా చదవండి ...
Viral Dance : టీమిండియా (Team India) స్టార్ పేసర్ దీపక్ చహర్ (Deepak Chahar) ఈ నెల 1వ తేదీన ప్రేయసి జయ భరద్వాజ్ ఆగ్రాలో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్లేయర్లు హాజరయ్యారు కూడా. దీపక్ చహర్ వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోతున్నా అతడి క్రికెట్ కెరీర్ మాత్రం ఎత్తుపల్లాలను చూస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ (IPL) మెగా వేలంలో దీపక్ చహర్ ను రూ. 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వెస్టిండీస్ (West Indies)తో జరిగిన టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. అయితే మూడో టి20 సందర్భంగా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో వెన్నుగాయం బారిన పడ్డ అతడు.. ఆటకు నిరవధిక విరామం ప్రకటించాడు.

ఇది కూడా చదవండి : కార్తీక్ క్రికెట్ లో అరంగేట్రం చేసేనాటికి వీళ్లంతా చెడ్డీ బ్యాచ్.. ఎవరంటే?

అయితే తాజాగా దీపక్ చహర్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా భార్య జయతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. భార్యభర్తలు ఇద్దరు కూడా అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టారు. ఇందుకోసం వీరు స్పెషల్ కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయించుకోవడం విశేషం. ఇక ఈ వీడియోకు దీపక్ చహర్ అదిరిపోయే క్యాప్షన్ ను జత చేయడం విశేషం. క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ’డ్యాన్స్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకుంది‘ అంటూ క్యాప్షన్ పెట్టాడు.




దీపక్ చహర్ గాయం చాలా తీవ్రమైందిగా సమాచారం. అతడు మరో నాలుగు లేదా ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే టి20 ప్రపంచకప్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే దీపక్ చహర్ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్ సేవలను భారత్ కోల్పోవలసి వస్తుంది. ప్రపంచకప్ కోసం జట్టు ఎంపికపై తుది నిర్ణయం రాహుల్ ద్రవిడ్ దే అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ తో జరిగే టి20 సిరీస్ లో రాణించిన ప్లేయర్లకే ప్రపంచకప్ జట్టులో చోటన్నట్లు గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Agra, Chennai Super Kings, India vs england, Ravichandran Ashwin, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు