హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: అర్జెంటీనాపై అద్భుత విజయం... క్వార్టర్ ఫైనల్‌లో పురుషుల హాకీ జట్టు

Tokyo Olympics: అర్జెంటీనాపై అద్భుత విజయం... క్వార్టర్ ఫైనల్‌లో పురుషుల హాకీ జట్టు

అర్జెంటీనాపై గెలిచిన భారత్.. క్వార్టర్ ఫైనల్‌కి అర్హత (Hockey India)

అర్జెంటీనాపై గెలిచిన భారత్.. క్వార్టర్ ఫైనల్‌కి అర్హత (Hockey India)

పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. పూల్ ఏలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది.

టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics)  భారత పురుషుల హాకీ జట్టు (Mens Hockey Team) దూసుకొని పోతున్నది. పూల్ ఏ‌లో భాగంగా గురువారం ఉదయం అర్జెంటీనాతో (Argentina) జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన అర్జెంటీనా తొలి క్వార్టర్‌లోనే గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే భారత హాకీ ప్లేయర్లు ఆ తర్వాత ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 43వ నిమిషంలో టీమ్ ఇండియాకు వరుణ్ కుమార్ తొలి గోల్ అందించాడు. 58వ నిమిషంలో వివేక్ సాగర్ రెండో గోల్ చేశాడు. దాంతో ఆధిక్యం 2-1కి పెరిగింది. 59వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ మూడో గోల్ చేయడంతో భారత్‌కు 3-1తో తిరుగు లేని ఆధిక్యత లభించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత భారత జట్టు 3-1తో విజయం సాధించింది. పూల్ ఏలో మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా పురుషులు క్వార్టర్ ఫైనల్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు. తర్వాత మ్యాచ్‌లో భారత జట్టు ఆతిథ్య జపాన్‌తో తలపడనున్నది.


ఒలింపిక్స్‌లో తొలి మ్యాచ్ న్యూజీలాండ్‌పై నెగ్గిన భారత జట్టు.. ఆస్ట్రేలియాపై మాత్రం 1-7 తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత స్పెయిన్‌పై 3-0తో అర్జెంటీనాతో 3-1 తేడాతో గెలిచింది. శుక్రవారం భారత్-జపాన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది.

First published:

Tags: Olympics, Team India, Tokyo Olympics

ఉత్తమ కథలు