Rohit Sharma New Look : రోహిత్ శర్మ.. ఆధునిక క్రికెట్ లో విరాట్ కోహ్లీ తర్వాత.. అత్యంత పేరుపొందిన క్రికెటర్. తన బ్యాటింగ్, కెప్టెన్సీ స్కిల్స్ తో టీమిండియాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
దూకుడులో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వారసత్వం.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో యువ ఆటగాళ్లకు స్పూర్తి కలిగిస్తాడు.. సిక్సర్ల సునామీ సృష్టించడంలో అతడికి అతడే సాటి.. బ్యాటర్ గా ముందుండి నడిపిస్తాడు.. అవకాశం వచ్చిన ప్రతీసారి సారథిగా వెనకుండి ప్రోత్సహిస్తాడు అతడే టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma).అయితే, గత కొన్నాళ్లుగా రోహిత్ మెరుపులు టీమిండియా ఫ్యాన్స్ మిస్సవుతూనే ఉన్నారు. గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ బెంగళూర్‌లోని ఎన్సీఏ అకాడమీలో కోలుకుంటున్నాడు. రోహిత్ శర్మ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లో పోస్ట్ చేసిన తన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో హిట్‌మ్యాన్ ఎప్పుడు లేనంత కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. క్లీన్ షేవ్ చేసుకున్న రోహిత్.. మీసాలను కూడా పూర్తిగా తీసేశాడు. ఆకుపచ్చ రంగు టీషర్టు, నలుపు రంగు టోపీ ధరించాడు. ఫ్రెష్ లుకులో కనిపిస్తున్నాడు.
అలాగే, ఎన్సీఏలో బరువు తగ్గేందుకు కృషి చేస్తున్న హిట్‌మ్యాన్ సానుకూల ఫలితం సాధించినట్లు ఈ ఫోటోలో తెలుస్తుంది. రోహిత్ శర్మ గతం కంటే బరువు తగ్గినట్టు ఈ ఫోటోలో అర్థమవుతుంది. దీంతో గతం కన్న భిన్నంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్లిమ్‌గా కనిసిస్తున్నాడు. దీనికి తీడు క్లీన్ సేవింగ్‌తో కనిపించడం ఆకట్టుకుంటుంది. క్లీన్ షేవ్ ఉండడంతో రోహిత్ శర్మ ముఖం గతం కంటే ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనిపించడం ఈ ఫోటోలో చూడవచ్చు. దీంతో రోహిత్ న్యూలుక్‌పై అభిమానులతోపాటు క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, రోహిత్ శర్మను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉందని చెప్పాలి. టీ-20 వరల్డ్ కప్ తర్వాత.. పరిమిత ఓవర్లకు రోహిత్ నే కెప్టెన్ గా ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ క్రమంలో ప్రాక్టీస్ చేస్తుండగా హిట్‌మ్యాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో సౌతాఫ్రకా పర్యటన మొత్తానికే రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా, వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా సెలెక్టర్లు లోకేష్ రాహుల్‌ను ఎంపిక చేశారు.
ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఎలో కోలుకుంటున్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై అంతటా భారీ అంచనాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో మంచి విజయాలే సాధించినప్పటికీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది.
దీంతో ఆ లోటును రోహిత్ శర్మ తీరుస్తాడని అంతా భావిస్తున్నారు. ఐపీఎల్ లో రోహిత్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఐదు సార్లు ముంబైని ఛాంపియన్ గా నిలిపాడు. దీంతో.. సెలెక్టర్లు రోహిత్ పై భారీ నమ్ముకముంచారు. ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2023 వరల్డ్ కప్ లు ఉన్నాయ్. ఈ రెండింటిలోనూ రోహిత్ శర్మ నేతృత్వంలోనే టీమిండియా బరిలోకి దిగే ఛాన్సుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.