ఏషియాడ్‌లో సొంత మెడల్స్ రికార్డ్‌ సమం చేసిన భారత్

2010 గ్వాంగ్జూ ఆసియా గేమ్స్‌లో సాధించిన 65 పతకాల రికార్డును భారత్ 18వ ఏషియాడ్‌లో సమం చేసింది. ఏషియాడ్‌ పతకాల వేటలో భారత్ సొంత రికార్డ్ బ్రేక్ చేయనుంది.

news18-telugu
Updated: September 1, 2018, 11:16 AM IST
ఏషియాడ్‌లో సొంత మెడల్స్ రికార్డ్‌ సమం చేసిన భారత్
ఏషియాడ్ పతక విజేతలు
  • Share this:
ఏషియాడ్ 2018లో భారత క్రీడాకారులు,అథ్లెట్లు చరిత్రను తిరగరాస్తూనే ఉన్నారు. 2010 గ్వాంగ్జూ గేమ్స్‌లో మొత్తంగా సాధించిన 65 పతకాలే ఇప్పటివరకూ ఆసియా గేమ్స్ చరిత్రలో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన. పదమూడో రోజు హాకీ ఫైనల్లో రజతం సాధించిన మహిళల జట్టు, ఆ రికార్డును సమం చేసింది.65 పతకాల సొంత రికార్డ్ సమం చేసుకున్న ఇండియా..ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర‌కు శ్రీకారం చుట్టునుంది. ఆఖరి రోజు పోటీల్లోనూ మరిన్ని పతకాలు భారత ఖాతాలో బాక్సింగ్‌లో ఫైనల్ చేరిన అమిత్ పంగల్, స్క్వాష్ అమ్మాయిల జట్టు మరో రెండు పతకాలు ఖరారు చేసేశారు. అదీ గాక భారత పురుషుల జట్టు కాంస్య పతకం కోసం పాకిస్తాన్‌తో తలబడబోతోంది. దాంతో టీమిండియా పతకాల వేట ఇంకా కొనసాగనుంది. దాంతో 2010 రికార్డును చెరిపేయడం ఖరారైపోయింది.

నిజానికి స్వర్ణ పతకాలు సాధిస్తారనుకున్న పురుషుల కబడ్డీ, మహిళల కబడ్డీ జట్లు తీవ్రంగా నిరాశ పరిచాయి. దీపికా కుమారి, దీపా కర్మాకర్ వంటి ఆటగాళ్లు ఏషియాడ్‌లో తీవ్రంగా నిరాశపరిచారు. అయినా 18వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతమే చేశారు.అథ్లెటిక్స్ నుంచి ఏకంగా 7 స్వర్ణాలు, 10 రజతాలు, 2 కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.విదేశాల్లో జరిగిన ఆసియా గేమ్స్‌లో ఇండియన్ అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం.

ఏషియాడ్‌లో పదమూడో రోజు పతకాలు సాధించిన భారతీయులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గాయం కారణంగా సెమీ ఫైన‌ల్‌కు దూరమై, కాంస్య పతకం సాధించిన వికాస్ క్రిషన్‌ను అభినందించిన మోదీ, భవిష్యత్తులో తన నుంచి ఇంకా మంచి ప్రదర్శన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంస్యం గెలిచిన పురుషుల స్క్వాష్ జట్టును కూడా ప్రశంసల్లో ముంచెత్తారు మోదీ. ‘సూపర్బ్ స్క్వాష్. కాంస్యం గెలిచిన హరిందర్ పాల్ సింగ్, సౌరవ్ గోషల్, రమిత్ టంగన్, మహేష్ మంగోన్‌కర్‌లకు అభినందనలు. ఈ కుర్రాళ్లు భవిష్యత్తులో ఇంకా అదరగొడతారని ఆశిస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని.సెయిలింగ్‌లో పతకం సాధించిన వరుణ్ తక్కర్, కేసీ గణపతిని కూడా అభినందిస్తూ ట్వీట్ చేశారు ఇండియన్ పీఎం.సెయిలింగ్‌లో కాంస్యం సాధించిన యువ సెయిలర్ హర్షితా తోమర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు ప్రధాని. ‘ఆసియా గేమ్స్ 2018లో యంగ్ అథ్లెట్స్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలుస్తోంది. 16 ఏళ్ల హర్షితా తోమర్ ఓపెన్ లేసర్ సెయిలింగ్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచింది. ఆమె విజయం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెకు అభినందనలు...’ అంటూ ట్వీట్ చేశారు మోదీ.ఇవీ చదవండి...

సెయిలింగ్‌లో మరో పతకం, కాంస్యం సాధించిన హర్షితా తోమర్

ఏషియాడ్: సెయిలింగ్‌లో పురుషుల జట్టుకు కాంస్యం

ఏషియాడ్: సెయిలింగ్ మహిళా జట్టుకు రజతం
Published by: Ramu Chinthakindhi
First published: September 1, 2018, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading