• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • TEAM INDIA HEAD COACH RAVI SHASTRI GETS FIRST DOSE OF THE CORONAVIRUS VACCINE AND TROLLED BY NETIZENS SRD

Ravi Shastri : 24 గంటలు మత్తులోనే ఉంటావ్... నీకెందుకు వ్యాక్సిన్..రవిశాస్త్రిపై పేలుతున్న జోకులు..

Ravi Shastri : 24 గంటలు మత్తులోనే ఉంటావ్... నీకెందుకు వ్యాక్సిన్..రవిశాస్త్రిపై పేలుతున్న జోకులు..

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న రవిశాస్త్రి (Photo : Twitter)

Ravi Shastri : టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం కోవిడ్ టీకా వేయించుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతా‌లో పోస్ట్ చేశారు.

  • Share this:
    టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం కోవిడ్ టీకా వేయించుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతా‌లో పోస్ట్ చేశారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, మెడికల్‌ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ వాక్సినేషన్‌ ప్రక్రియను ఎంతో నిబద్ధతతో.. సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి కూడా ఆయన అభినందించారు. అయితే రవిశాస్త్రి ట్వీట్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత 45 రోజులు వరకు మద్యం ముట్టవద్దని ఒకరంటే.. ఏ కేటగిరీలో రవిశాస్త్రి వ్యాక్సినేషన్ తీసుకున్నాడని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. "నీకేందుకయ్యా వ్యాక్సిన్ 24 గంటలు మత్తులోనే ఉంటావ్.. నీ బాడీకి పనిచేస్తుందా?"ఇంకొకరు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    ఇక సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ సైతం నిన్ననే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వాక్సినేషన్‌ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు టీకా వేసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. నిన్న ఒక్కరోజు రాత్రి వరకు సుమారు 29 లక్షల మంది వాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.












    ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌‌లో భాగంగా అహ్మదాబాద్‌లో ఉన్న రవిశాస్త్రి అక్కడే వ్యాక్సిన్ ఇప్పించుకున్నాడు. ఈ సిరీస్ ఇప్పటికే మూడు టెస్ట్‌లు ముగియగా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ వేదికగానే గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, డ్రా చేసుకున్నా భారత్ సిరీస్‌తో పాటు వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుతుంది. అలా కాకుండా ఓడితే మాత్రం ఫైనల్ బెర్త్ ఆసీస్‌కు దక్కుతుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు