హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కు వెళ్లేందుకు ఆర్థిక సాయం చేసిన టీమిండియా క్రికెటర్.. చెడగొట్టకు అంటూ కామెంట్స్

IND vs SA : గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కు వెళ్లేందుకు ఆర్థిక సాయం చేసిన టీమిండియా క్రికెటర్.. చెడగొట్టకు అంటూ కామెంట్స్

PC : TWITTER

PC : TWITTER

IND vs SA 2nd T20 : భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటాడు. క్రికెట్ వ్యవహారాలపై తరచూ ట్వీట్ చేస్తూ ఉంటాడు. దాంతో ట్విట్టర్లో అమిత్ మిశ్రాను అనుసరించే క్రికెట్ అభిమానులు ఎక్కువగానే ఉంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA 2nd T20 : భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటాడు. క్రికెట్ వ్యవహారాలపై తరచూ ట్వీట్ చేస్తూ ఉంటాడు. దాంతో ట్విట్టర్లో అమిత్ మిశ్రాను అనుసరించే క్రికెట్ అభిమానులు ఎక్కువగానే ఉంటారు. దాదాపు అమిత్ మిశ్రాకు ట్విట్టర్ లో 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. తాజాగా ఒక అభిమానికి అమిత్ మిశ్రా ఆర్థిక సాయం చేశాడు. అసలేం జరిగిందంటే. ఇటీవలె ట్విట్టర్ లో అమిత్ మిశ్రాకు తన అభిమాని నుంచి ఒక రిక్వెస్ట్ ట్వీట్ వచ్చింది. అందులో ఆ అభిమాని.. ‘నా గర్ల్ ఫ్రెండ్ ను డేట్ కు తీసుకెళ్తున్నా. ఒక 300 రూపాయాలు ఇస్తారా‘ అంటూ అమిత్ మిశ్రాను రిక్వెస్ట్ చేశాడు.

ఇక ఈ ట్వీట్ చూసిన అమిత్ మిశ్రా.. సదరు అభిమాని బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని రూ. 500 రూపాయలను ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేశాడు. ఈ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా అమిత్ మిశ్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ‘డన్.. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డేట్ ’ అంటూ ట్వీట్ పెట్టాడు. ఇక ఈ ట్వీట్ కు ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చి మరీ చెడగొడుతున్నావ్ అని ఒకరు.. సర్ నాతో డబ్బుంది కానీ బాయ్ ఫ్రెండ్ లేడు వెతికి పెడతారా అంటూ ఒక అమ్మాయి ట్వీట్ చేసింది.

ఇక అమిత్ మిశ్రా 2003లో టీమిండియా తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో 2008లో.. టి20ల్లో 2010లో చేశాడు. 22 టెస్టులు ఆడిన అమిత్ మిశ్రా 76 వికెట్లు తీశాడు. ఇక 36 వన్డేల్లో 64 వికెట్లు.. 10 టి20ల్లో 16 వికెట్లు తీశాడు. 2008 నుంచి 2021 వరకు ఐపీఎల్ ఆడిన అమిత్ మిశ్రా 154 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 166 వికెట్లు తీశాడు. 7.33 ఎకానమీ. ఐపీఎల్ లో అత్యధికంగా మూడు సార్లు హ్యాట్రిక్ ప్రదర్శన చేసిన ఏకైక బౌలర్ గా కూడా అమిత్ మిశ్రా ఉండటం విశేషం. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో అమిత్ మిశ్రాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Delhi Capitals, India vs South Africa, IPL, IPL 2022, Team India, Twitter

ఉత్తమ కథలు