Home /News /sports /

TEAM INDIA FORMER HEAD COACH RAVI SHASTRI SOME INTERESTING COMMENTS ON SOURAV GANGULY VIRAT KOHLI AND TEAM INDIA SELECTION SRD

Ravi Shastri : " గంగూలీ నా జూనియర్.. దాదాతో ఆ విషయంలోనే తేడా జరిగింది " .. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు..

Ravi Shastri

Ravi Shastri

Ravi Shastri : టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో భారత హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి (Ravi Shastri) పదవీకాలం ముగిసింది. టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి జాతీయ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంకా చదవండి ...
  టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) టోర్నీలో టీమిండియా (Team India) ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్, కివీస్ లాంటి రెండు జట్లపై ఓడి.. సూపర్ -12 స్టేజీలోనే నిష్క్రమించింది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో భారత హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి (Ravi Shastri) పదవీకాలం ముగిసింది. టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి జాతీయ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఎంపికలో కెప్టెన్‌ జోక్యం చేసుకోడని, సెలెక్టర్లే ఎంపిక చేస్తారని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. టీ20 ప్రపంచకప్‌తో హెడ్ కోచ్‌గా తన పదవికాలాన్ని పూర్తి చేసుకున్న రవిశాస్త్రి రిపబ్లిక్ టీవీతో మాట్లాడాడు. 'Shastri Speaks Arnab' కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అర్ణబ్ గోస్వామి అడిగిన వివాదాస్పద ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చాడు. టీ20 ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో విమర్శకులు తమ పెన్నులను తుపాకుల్లా తమపై ఎత్తిపెట్టారని చెప్పాడు. భారత్‌లో క్రికెట్‌ను మతంలా ఆరాధిస్తారని, అందుకే ఓటమిని ఏ మాత్రం సహించరని చెప్పుకొచ్చాడు.

  కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమ్ ఎంపిక విషయంలో ఎవరి మాట పట్టించుకోడని, దీంతో.. కోహ్లీ-శాస్త్రి టీమ్‌గా మారిందని చాలా ఆరోపణలున్నాయని ప్రశ్నించగా.. శాస్త్రి తనదైన శైలిలో బదులిచ్చాడు. 15 మంది సభ్యులను సెలెక్టర్లే ఎంపిక చేస్తారని, ఇందులో కెప్టెన్ పాత్ర ఏం ఉండదని స్పష్టం చేశాడు. అయితే ఇలాంటి వార్తలను తాను అస్సలు పట్టించుకోనని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత వైఫల్యానికి తీరిక లేని షెడ్యూల్ ఓ కారణమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

  " భారత్‌లో క్రికెట్‌ ఓ మతంలాంటిది. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ఒక్కదాంట్లో ఓడినా ఇక్కడి ప్రజలు సహించరు. తమ పెన్స్‌ను తుపాకుల్లా ఎత్తిపెడుతారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. మేం వరుసగా విజయాలు సాధించి ఓడిపోయేసరికి తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఇష్టం వచ్చినట్లు రాసారు. నాకు విరాట్ కోహ్లీ మధ్య గొడవలు ఉన్నట్లు ప్రచారం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వచ్చే ఇలాంటి వార్తలను నేను అస్సలు పట్టించుకోను. నేను వాటిని చదవను కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది అనేది మాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించుకొని రాసుకుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు.

  విరాట్ కోహ్లీ కూడా స్కోర్ కార్డుపై రాసే వాటిని మాత్రమే పట్టించుకుంటాడు. జనాలందరికీ గుర్తండేది కూడా అదే. ఎవరెన్ని పరుగులు చేశారు. ఎన్ని వికెట్లు తీశారనేది మాత్రమే జనాలకు ఏ టీమ్‌కైనా కావాల్సింది. నాలుగేళ్ల కాలంలో నేను సాధించిన విజయాలు, నాకు సంతృప్తినిచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లండ్ పర్యటలో అద్భుత విజయాలు అందుకున్నాం. అలాగే ఈ కాలంలో జట్టు ఎప్పుడు విఫలమైనా నన్న విమర్శించారు. టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నన్నినాళ్లు నేను చేసే ప్రతీ పనిని జనాలు, ఎత్తి చూపించారు. ఇప్పుడు నా టైం వచ్చింది. నేను తాపీగా కూర్చొని వాళ్లను చూస్తూ ఆనందిస్తా. విమర్శలను పట్టించుకోకుండా వెళ్తేనే విజయాలు వస్తాయి. " అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

  ఇక సౌరవ్ గంగూలీతో తనకు గొడవలున్నాయని వస్తున్న కథనాలపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. " సౌరవ్ గంగూలీ నాకు ఎప్పటినుంచో తెలుసు. అతను నా జూనియర్. టైమ్స్ షీల్డ్ టోర్నీలో దాదా స్టీల్‌కు ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్‌గా ఉన్నా. భారత జట్టు హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూ హాజరయ్యే సమయంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)లో సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ సభ్యులుగా ఉన్నారు. ఆ మీటింగ్‌కు వచ్చేటప్పుడు నేను హెడ్ కోచ్ అయితే ఏం చేయగలనో వాటిని ఓ లెటర్‌పై రాసుకున్నా. కానీ ఇంటర్వ్యూ సమయానికి అది ఎక్కడో పోయింది. అదే విషయం కమిటీ ముందు చెబితే అది దాదాకు నచ్చలేదు. దాన్ని అడ్డుగా పెట్టి అనేక కథనాలు సృష్టించారు. " అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

  ఇది కూడా చదవండి : " క్యాచ్ ఎందుకురా పట్టలేదు.. కేక్ పెట్టలేదు మీరు నాకు.. " జాతిరత్నాలు డైలాగ్ తో రచ్చ రచ్చ..

  "టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నన్నినాళ్లు నేను చేసే ప్రతీపనిని జనాలు, ఎత్తి చూపించారు. ఇప్పుడు నా టైం వచ్చింది. నేను తాపీగా కూర్చొని వాళ్లను చూస్తూ ఆనందిస్తా... విమర్శలను పట్టించుకోకుండా వెళ్తేనే విజయాలు వస్తాయి... " అంటూ చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Rahul dravid, Ravi Shastri, Sourav Ganguly, T20 World Cup 2021, Team india, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు