Home /News /sports /

TEAM INDIA FORMER HEAD COACH RAVI SHASTRI DID NOT PICK DINESH KARTHIK HIS PLAYING XI FOR FIRST T20 AGAINST SOUTH AFRICA SRD

Ravi Shastri : ఏంది రవి కాక ఈ గడిబిడి.. నువ్వే ఫినిషర్ అన్నావ్.. మరి అతడికి నీ తుదిజట్టులో చోటేది..!

రవి శాస్త్రి (ఫైల్ ఫోటో)

రవి శాస్త్రి (ఫైల్ ఫోటో)

Ravi Shastri : భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఐపీఎల్‌ 2022 సీజన్ (IPL 2022) లో దుమ్మురేపిన ఆటగాళ్లను ఈ సిరీస్‌ కోసం భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ ద్వారా వారందర్నీ పరీక్షించే అవకాశం దక్కింది.

ఇంకా చదవండి ...
    ఈ ఏడాది టీమిండియా (Team India)కు ఎంతో కీలకం. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 WorldCup 2022)లో సత్తా చాటాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. ఇందు కోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఐపీఎల్‌ 2022 సీజన్ (IPL 2022) లో దుమ్మురేపిన ఆటగాళ్లను ఈ సిరీస్‌ కోసం భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ ద్వారా వారందర్నీ పరీక్షించే అవకాశం దక్కింది. ఈ సిరీస్ లో సత్తా చాటిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో ఫస్ట్ టీ20 కోసం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ప్లేయింగ్ 11ని ప్రకటించాడు.

    ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2022 సీజన్ లో భీకర ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌ను పట్టించుకోలేదు రవిశాస్త్రి. తన తుది జట్టులో చోటివ్వలేదు. అయితే ఇదే రవిశాస్త్రి.. దినేష్ కార్తీక్ రూపంలో ధోని లాంటి ఫినిషర్ దొరికాడని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

    స్టార్ స్పోర్ట్స్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'దినేష్ కార్తీక్‌కు ఇది మంచి అవకాశం. అతను జట్టుకు కీ ఫ్యాక్టర్ కావచ్చు. అతను అనుభవజ్ఞుడు. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరి టీమిండియా ఏం కోరుకుంటుందో చూడాలి. ప్రస్తుతం జట్టుకు టాప్ ఆర్డర్‌లో లేదా ఫినిషర్‌గా ఆడగల వికెట్ కీపర్ అవసరం. మహేంద్ర సింగ్ ధోనీ పాత్రను పోషించగల వికెట్ కీపర్ కావాలి.

    ఇది కూడా చదవండి : కెప్టెన్సీ వదిలేశాడు.. సచిన్ ను వెనక్కి నెట్టాడు.. రికార్డుల మోత మోగించాడు..

    టీమిండియాలో కార్తీక్ తో పాటు రిషబ్ పంత్ ఉన్నాడు. అతడు టాప్ 4లో సత్తా చాటగలడు. భారత జట్టులో ఎక్కువ మంది ఫినిషర్లు లేరు. మహేంద్ర సింగ్ ధోనీ రిటైరయ్యాడు. కాబట్టి ఇప్పుడు దినేష్ కార్తీక్‌ రూపంలో టీమిండియాకు మంచి అవకాశం దక్కింది. అయితే, అతని జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి' అని చెప్పుకొచ్చాడు.
    అయితే.. దినేష్ కార్తీక్ కు ఫినిషర్ రోల్ ఇవ్వాలన్న రవిశాస్త్రి తన తుది జట్టులో చోటు ఇవ్వలేదు. దీంతో.. ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఏంది రవి కాక ఈ గడిబిడి.. నువ్వే ఫినిషర్ అన్నావ్.. మరి దినేష్ కార్తీక్ కి నీ తుదిజట్టులో చోటేది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తన తుది జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్, సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు.

    ఆశ్చర్యకరంగా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా మాత్రం శాస్త్రి ఎంచుకోలేదు. ఇకపోతే గుజరాత్ టైటాన్స్‌‌కు అరంగేట్రంలోనే ఐపీఎల్ ట్రోఫీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ప్లేయింగ్ 11లో కీలకమైన ప్లేయర్‌గా రవిశాస్త్రి పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు చాలా ఉపయోగపడే ప్లేయర్ అవుతాడని పేర్కొన్నాడు.

    ఇది కూడా చదవండి : 16 ఏళ్లలో కేవలం 15 టీ20 మ్యాచులు.. స్వదేశంలో టీమిండియా రికార్డు చూస్తే ఎక్కడో తేడా కొడుతోంది..!

    ఇకపోతే ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్‌గా పేర్కొన్నాడు. ఇక 4వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను, అయిదో స్థానంలో రిషబ్ పంత్‌ను, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యాను రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇకపోతే బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్‌లను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ మరియు ఉమ్రాన్ మాలిక్ మధ్య ఎవరినైనా ఒకరిని తీసుకోవాలని ప్రస్తావించాడు. ఇక మీడియం పేసర్ మరియు స్పెషలిస్టు బౌలర్‌గా హర్షల్ పటేల్‌ను ఎంచుకున్నాడు.

    రవిశాస్త్రి ప్రకటించిన తుదిజట్టు : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Dinesh Karthik, India vs South Africa, KL Rahul, Ravi Shastri, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు