రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన జీవితంలో ఎదురైన ఒక చేదు సంఘటను గుర్తు చేసుకున్నా సంగతి తెలిసిందే. తాను ఏ విధంగా ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నానో వివరించాడు. ఆర్సీబీ ఆటగాడు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. సరదాగా ఆరంభమైనది కాస్తా చాహల్ ప్రాణం మీదకు తెచ్చింది. చాహల్ జీవితంలో ఆ చేదు సంఘటన 2013లో చోటు చేసుకుంది. " 2013లో ఆ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు నేను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు ఆడుతున్నాను. మేం బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడాం. దాని తర్వాత టీం సభ్యులమంతా కూడా ఒక రూంలో గెట్ టు గెదర్ అయ్యాం. అప్పుడు ముంబై ఇండియన్స్ లోని ఓ సభ్యుడు (పేరు చెప్పడానికి చహల్ ఇష్టపడలేదు) ఫుల్ గా తాగి నా వద్దకు వచ్చాడు. అనంతరం నన్ను అమాంతం పైకెత్తి... బాల్కనీ నుంచి కిందకి వేలాడదీశాడు. నేను అతడి మెడను పట్టుకుని గట్టిగా అరుస్తున్నా. అతడి మెడ నుంచి నా చేతులు జారిపోతే... నేను 15వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయే అవకాశం ఉంది. అలా అరుస్తూ ఉండగా... ఇతర టీం సభ్యులు వెంటనే వచ్చి నన్ను కాపాడారు. ఆ షాక్ లో నేను స్పృహ కోల్పోయాను. అదో దారుణమైన సంఘటన" అంటూ తన ప్రాణం మీదకు తెచ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
అయితే, యుజ్వేంద్ర చాహల్‌కు ఎదురైన ఈ ఘటనపై పలువురు క్రికెట్ ప్రముఖులు సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.. ఆ నేరానికి పాల్పడిన క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలి. సమీప భవిష్యత్తులో మైదానంలోకి అడుగుపెట్టనీయొద్దని సూచించాడు. ఇది చిన్న విషయం ఏమాత్రం కాదని అన్నాడు.
'' నేను ఇలాంటి ఘటనను చూడటం ఇదే తొలిసారి. ఇది చిన్న విషయం కాదు. చాహల్‌కు ఎదురైనటువంటి ఘటన ఈ రోజుల్లో జరిగితే.. ఆ వ్యక్తిపై జీవితకాల నిషేధం పడేది. వీలైనంత తొందరగా పునరావాస శిబిరానికి పంపేవారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో నాకు తెలియదు. అతడు ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదు. కానీ.. ఒకరి జీవితం ప్రమాదంలో ఉంటే అది ఎప్పటికీ ఫన్నీ కాదు.'' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. ఆ ఆటగాడి పేరు చెప్పాలని అన్నాడు. అటువంటి ఆటగాణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు వీరూ. అయితే, ఆ క్రికెటర్ ఆర్సీబీ మాజీ ఓపెనర్.. యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. ఓ సారి చాహల్ ను అస్సలు వదలను చంపేస్తా అంటూ క్రిస్ గేల్ ఇచ్చిన ఫన్నీ వార్నింగ్ ను ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. మరి, చాహల్ ఆ క్రికెటర్ పేరు బయటపెడతాడో లేదో వేచి చూడాలి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.