క్రికెట్ కు రిటైర్ ప్రకటించిన తర్వాత సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాడు. ఎప్పుటి కప్పుడూ తన అప్ డేట్స్ తో పాటు.. ఫన్నీ వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉన్నాడు. ఇక, లేటెస్ట్ గా యువీ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువీ తన టాలెంట్ ను బయటపెట్టాడు. వివరాల్లో కెళితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) గురువారం తన 33వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. దీంతో .. అతనికి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే.. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం ఇషాంత్ కి భిన్నంగా బర్త్ డే విషెస్ తెలియజేయడం గమనార్హం. ఇషాంత్ శర్మ వాయిస్ ని మిమిక్రీ చేసి.. ఆ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం గమనార్హం. దానికి హ్యాపీ బర్త్ డే అంటూ క్యాప్షన్ జత చేసి మరీ షేర్ చేశాడు. ఇషాంత్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు యూవీ పేర్కొన్నాడు. ఈ వీడియోకి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
ఇక, ఇషాంత్ శర్మకు బీసీసీఐ, ఐసీసీ, ఢిల్లీ క్యాపిటల్స్, భారత క్రికెటర్లు వృద్ధీమాన్ సాహా, దినేశ్ కార్తీక్ ట్విటర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ఓవల్ వేదికగా ఇంగ్లాడ్-భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇషాంత్ శర్మకు తుదిజట్టులో చోటు దక్కలేదు.
ఇక, టీమిండియాలో ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రంగ ప్రవేశం చేశాడు. చివరగా 2017లో వెస్టిండీస్‌తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
యువరాజ్ తన కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8,701 పరుగులు, టీ20ల్లో 8 అర్ధసెంచరీలతో 1177 పరుగులు, టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు.
మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో భారత్ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో(2007 టీ20, 2011 వన్డే) యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో అటు బ్యాట్, ఇటు బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి టీమిండియా కప్పు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 9మ్యాచ్‌ల్లో 362(ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు)పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Sports, Viral Videos, Yuvraj Singh